Home

»

Latest News

బాలయ్య కూతురు సినిమాకి డైరెక్టర్ లాక్.!

Aug 4, 2026 10:10AM

నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల న్యూస్ వినిపించింది.

ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ సబ్జెక్టుతో ఆమె డెబ్యూ ఉంటుందని ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు తేజస్విని డెబ్యూ మూవీకి డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

'వరుడు కావలెను' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన లక్ష్మి సౌజన్య.. తాజాగా తేజస్విని కలిశారు.

"తేజస్విని గారిని కలవడం సంతోషంగా ఉంది. ఆమెను మళ్లీ కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ సోషల్ మీడియాలో ఒక సెల్ఫీని కూడా షేర్ చేశారు లక్ష్మి సౌజన్య.

దీంతో  లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తేజస్విని నటిగా పరిచయం కాబోతున్నారనే ప్రచారం మొదలైంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

 

 

Nandamuri Balakrishna, Tejaswini Nandamuri, Lakshmi Sowjanya

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com