.webp)
మేకర్స్, హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన భామ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). తను ఒక సినిమా ఒప్పుకుందంటే ఆ సినిమా సూపర్ గా ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయ్యారు. ప్రీవియస్ చిత్రం 'డెకాయిట్' నే ఉదాహరణ. డెకాయిట్ టాక్ నెగిటివ్ గానే వచ్చినా కలెక్షన్స్ పరంగా మాత్రం పర్వలేనిదని పించింది. అడివి శేష్ తో పాటు మృణాల్ చరిష్మా కూడా కారణమని ఒప్పుకోక తప్పదు.
సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ ద్వారా మృణాల్ ఒక నోట్ విడుదల చేశారు. 'నా అనుమతి లేకుండా నా పోలికలు లేదా ముఖాన్ని ఉపయోగించి డిప్‌ఫేక్ కంటెంట్‌ను సృష్టించడం లేదా షేర్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఏమాత్రం సహించరాని నేరం. దీనిని నన్ను లక్ష్యంగా చేసుకుని డిప్‌ఫేక్స్ తయారు చేస్తున్న వారికి, షేర్ చేస్తున్న వారికి చివరి హెచ్చరిక చేస్తున్నాను. ఇకపై నా ఐడెంటిటీని కొంచెం దుర్వినియోగం చేసినా నేరుగా న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతాను. మహిళా నటుల శరీరాలను, ముఖాలను డిజిటల్ పద్ధతిలో మార్చి ఇంటర్నెట్‌లో వికృత రూపంలో వైరల్ చేయడం సమాజంలో పెరిగిపోతున్న నైతిక పతనానికి నిదర్శనమని ఆమె ఆవేదన చెందారు. నటీనటులుగా వెండితెరపై ఎంత ప్రసిద్ధి చెందినప్పటికీ, మేము కూడా మీ లాంటి మనుషులమే. వ్యక్తిత్వానికి మరియు ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదు. లీగల్ కూడా వెళ్తాన ని తేల్చి చెప్పారు.
బాలనటి నుంచే మృణాల్ బాలీవుడ్ లో పలు సీరియల్స్, సినిమాలు చేసింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉండగా అల్లు అర్జున్, అట్లీ 'రాకా'లో ఉండవచ్చని టాక్.
Mrunal Thakur, Allu Arjun, Raaka






