Home

»

Latest News

తాప్సీ న‌యా టార్గెట్‌

Jun 6, 2015 11:43AM

దెయ్యం ప‌ట్టిన పిల్ల‌గా గంగ సినిమాలో సంద‌డి చేసి అల‌రించింది ఉంగ‌రాల జుట్టు చిన్న‌ది తాప్సీ. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ కిక్‌తో ఇప్పుడు త‌న‌ జోరును పెంచే ప‌నిలో ప‌డింది ఈ ఢిల్లీ బ్యూటీ.  ఆ జోరుని తెలుగు, త‌మిళం, హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లోనే కాకుండా ఇప్ప‌టివ‌ర‌కు తాను న‌టించ‌ని క‌న్న‌డ సీమ‌లోనూ చూపించేందుకు సిద్ధ‌మైంది ఈ అమ్మ‌డు. శాండిల్‌వుడ్‌లో ఇంత‌వ‌ర‌కూ ఒక్క సినిమా కూడా చేయ‌ని ఈ క‌ర్లింగ్ హెయిర్ బ్యూటీ.. రాజా రాణి పేరుతో రూపొంద‌నున్న ఓ క‌న్న‌డ చిత్రం కోసం సంత‌కాలు చేసేసింద‌ని అక్క‌డి వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి. చేత‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి నాగ శేఖ‌ర్‌ ద‌ర్శ‌కుడు. మ‌రి తాప్సీ న‌యా టార్గెట్ అయిన శాండిల్‌వుడ్‌లో ఆరంభం అదుర్స్ అనిపిస్తుందో లేదో చూడాలి?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com