Home

»

Latest News

శ్రియ రిస్క్ వ‌ర్క‌వుట‌వుద్దా?

Jun 6, 2015 10:49AM

 

ఫిట్‌నెస్ కి ప‌ర్యాయ‌ప‌దంలా నిలిచే అందం ఢిల్లీ డాళ్ శ్రియ సొంతం. ఈ జ‌న‌రేష‌న్ హీరోయిన్ల‌లో లాంగ్ ర‌న్ మెయిన్‌టెయిన్ చేసిన వారిలో ఈ సొగ‌సిరిదే ప్ర‌థ‌మ స్థానం. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, ఇంగ్లీష్‌.. ఇలా లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా మ‌ల్టీలాంగ్వేజెస్‌లో త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది ఈ నాజూకూ సుంద‌రి.  అయితే.. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విజయాల‌ను సొంతం చేసుకున్న ఈ  30 ప్ల‌స్ సొగ‌సు బాలీవుడ్‌లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు హిట్ కొట్ట‌లేక‌పోయింది. షుక్రియా, తుఝే మేరీ క‌స‌మ్‌, తోడా తుమ్  బ‌ద‌లే తోడా హ‌మ్‌, ఏక్‌, ఆవారాప‌న్‌.. ఇలా చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో సినిమాలు చేసినా శ్రియ‌కి నిరాశే ఎదురైంది. వీటిలో ఆవారాప‌న్ మ్యూజిక‌ల్‌గా సెన్సేష‌న్ అయినా.. హిట్ లిస్ట్‌లోకి చేర‌లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో శ్రియ రిస్క్ తీసుకుని  ఓ టీనేజ్ గ‌ర్ల్‌కి అమ్మ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది త‌న తాజా హిందీ సినిమాలో. ఆ సినిమానే దృశ్యం. మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో రూపొంది హిట్ అయిన ఈ సినిమా హిందీలోనూ హిట్ కావ‌డం ఖాయం అని.. త‌న‌ను ఇన్నాళ్లుగా ఊరిస్తున్న విజ‌యం దృశ్యం రీమేక్‌తో ల‌భిస్తుంద‌ని శ్రియ చెప్పుకొస్తోంది. అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా న‌టించిన ఈ సినిమా జులై 31న రిలీజ్ కానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com