Home

»

Latest News

తనికెళ్ళ భరణి, బ్రహ్మానందంకి షాక్ ఇచ్చిన పూజారి: అహం అణిగిందా!

Nov 14, 2026 11:59AM

 

తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం..పరిచయ వ్యాఖ్యానాలు అవసరం లేని పేర్లు. ఒక వేళ చెప్పడం స్టార్ట్ చేస్తే మన వైపు జాలిగా చూసే పరిస్థితి. ఎందుకంటే ఆ ఇద్దరి సినీ హిస్టరీ మాకు తెలియదా అని! 


రీసెంట్ గా తనికెళ్ల భరణి తన సినీ ప్రయాణంలో ఎదురైన ఒక అరుదైన, మరువలేని ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకున్నారు. సుమారు ఐదు వందలకు పైగా చిత్రాలలో వివిధ క్యారెక్టర్స్  పోషించి నటుడిగా, రచయితగా, దర్శకుడిగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మనిషిని పతనానికి గురిచేసే 'నేను' అనే అహంకారం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మనిషి ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా, తన చుట్టూ ఉండే కీర్తి ప్రతిష్టల వలన అహంభావం ప్రవేశించే అవకాశం ఉంటుందని, అయితే దానిని పూర్తిగా అణచివేసే ఒక సంఘటన తన జీవితంలో జరిగిందని వెల్లడించారు.  

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంతో కలిసి ఒకసారి ఒక ఆలయానికి వెళ్లినప్పుడు ఎదురైన సంఘటన తమ ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చివేసిందని తనికెళ్ల భరణి గుర్తుచేసుకున్నారు. తాము ఎంత ప్రముఖులం, సమాజంలో ఎంత గుర్తింపు ఉందనే గర్వం కొద్దిసేపు తమలో ఉన్నప్పటికీ, సాధారణంగా తాము ప్రముఖ నటులమని తెలిస్తే ఎవరైనా ప్రత్యేక గౌరవం ఇస్తారని ఆశించడం సహజమని, కానీ ఆ గుడిలోని పూజారి మాత్రం తాము వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారని భరణి గుర్తుచేసుకున్నారు. మరుసటి రోజు ఉదయమే ఎంతో శ్రద్ధగా అభిషేకం పూర్తి చేసిన తర్వాత, తాము ఇచ్చిన దక్షిణను కూడా ఆ పూజారి తీసుకోలేదని తెలిపారు.


 పైగా తమకు కాఫీ లేదా టిఫిన్ ఇస్తామన్నా ఆయన సున్నితంగా తిరస్కరించారని చెప్పారు.. తాము నటీనటులుగా ఎంత పేరు సంపాదించినా, దైవ సన్నిధిలో అందరూ సమానమేనని, ఆ పూజారి ప్రవర్తన తమలోని అహాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆయన ఎమోషనల్ అయ్యారు.తనకు ఒక ఎకరం పొలం, ఒక ఆవు, పూజించడానికి శివుడు ఉన్నాడని, తనకు మరే ఇతర కోరికలు లేవని ఆ పూజారి చెప్పిన మాటలు తనను ఎంతగానో కదిలించాయని తనికెళ్ల భరణి భావోద్వేగానికి గురయ్యారు. ఎవరినీ ఏదీ ఆశించకుండా అంత ప్రశాంతంగా, తృప్తిగా బతకవచ్చనే నిజాన్ని ఆ ఘటన తమకు నేర్పిందని చెప్పారు.

ఇది కూడా చదవండి: హీరోల అత్యవసర మీటింగ్...బాలయ్య దాదా సాంగ్ పై చర్చ!
 

మాలో ఉన్న అహంకారం ఆ పూజారి నిరాడంబరతని చూసి కుప్పకూలిపోయిందని, ఆ స్ఫూర్తితోనే తాను ఆ తర్వాత ‘మా చెడ్డ మంచోడు దేవుడు’ అనే అద్భుతమైన పాటను రాసినట్లు ఆయన వివరించారు.   ఆ పూజారి జీవన శైలి, నిరాడంబరత తమకు నేర్పిన పాఠం అంతా ఇంతా కాదని ఆయన పేర్కొన్నారు. జీవితంలో ఎదగడం ఎంత ముఖ్యమో, ఒదిగి ఉండటం అంతకంటే ముఖ్యమని ఈ సంఘటన తనకు నేర్పిన పాఠం అని ఆయన తెలిపారు.

 

సెలబ్రిటీలుగా వెలుగొందుతున్నప్పటికీ, సాధారణమైన ఒక పూజారి తత్వం తమ లాంటి ప్రముఖుల అహాన్ని ఎలా అణిచివేసిందో చెప్పడానికి ఈ అనుభవం ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తనికెళ్ల భరణి చెప్పిన ఈ ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చవచ్చు:దాదా సాంగ్ రచ్చ!
మీకు నచ్చవచ్చు:ఇట్లు అర్జున రికార్డు కలెక్షన్స్!

 

[Tanikella Bharani, Brahamanandham, Sivalayam, Pujari, Tollywood]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com