Home

»

Latest News

హీరోల అత్యవసర మీటింగ్...బాలయ్య దాదా సాంగ్ పై చర్చ!

Nov 14, 2026 11:27AM

ఎవరి కోసం.. ఎవరి కోసం.. ఈ ప్రేమ మందిరం అనే ఎవర్ గ్రీన్ లెజండ్రీ సాంగ్ ని ఇప్పుడు సినీ అభిమానులు పేరడీ చేస్తూ ఎవరి కోసం.. ఎవరి కోసం.. ఈ అతి ప్రమోషన్స్ అని బాధతో పాడుకునే పరిస్థితి. ఎందుకు వచ్చిందో చూద్దాం.


ప్రస్తుత సినిమా రంగంలో ప్రమోషన్ల పేరుతో జరుగుతున్న అతి పెద్ద ట్రెండ్ ప్రేక్షకుల్లో తీవ్ర ఆందోళనకి  గురి చేస్తోంది. ఒక సినిమా విడుదల కావడానికి ముందే, చిత్ర యూనిట్ విడుదల చేసే సాంగ్స్, టీజర్లు, ట్రైలర్లలోని ముఖ్యమైన హైలైట్స్, మెస్మరైజ్ చేసే స్టెప్స్ అన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా రివీల్ చేస్తున్నారు.

సాంగ్ రిలీజ్ పేరుతో సినిమాలోని అత్యుత్తమ మాస్ స్టెప్స్ లేదా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ముందుగానే ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మరుసటి రోజు థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యాజిక్ ఇచ్చే   కిక్ పూర్తిగా మిస్సవుతోంది. ప్రేక్షకులకు దక్కాల్సిన అసలైన థ్రిల్ ని ప్రమోషన్ల హోరులో ముందే నీరుకార్చేస్తున్నారు.

కేవలం కొద్దిమంది అభిమానులని లేదా నెటిజన్లని తక్షణమే ఆకట్టుకోవడం కోసం, కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన సినిమాలోని కీలక సన్నివేశాలను బలిపశువు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.

ఒకప్పుడు సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠ, థియేటర్లో స్క్రీన్ మీద పాటలు చూసినప్పుడు కలిగే అనుభూతి వేరుగా ఉండేది. కానీ నేడు ప్రమోషన్ల వ్యూహంలో భాగంగా సినిమాలోని 80 శాతానికి పైగా హైలైట్స్ ముందే బయటపెట్టేస్తున్నారు. దీనివల్ల ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ఆడియన్స్‌కు కొత్తదనం అనేదే లేకుండా పోతుంది.

ఇది కూడా చదవండి: దాదా సాంగ్ వైరల్

ముఖ్యంగా స్టార్ హీరోలు ఈ విషయంపై తీవ్రంగా ఆలోచించాలని, ప్రమోషన్స్ హద్దుల్లో ఉండేలా చూసుకోవాలని సినీ విశ్లేషకులు బలంగా కోరుకుంటున్నారు. కేవలం వ్యూస్, లైక్స్ కోసం సినిమాలోని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ను లీక్ చేయడం వల్ల లాంగ్ రన్ లో చిత్ర బాక్సాఫీస్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.

కేవలం ముగ్గురు, నలుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు లేదా చిన్న వర్గం ఆడియన్స్‌ను మెప్పించడం కోసం పూర్తి సినిమా ఫలితాన్ని ప్రమాదంలో పడేయడం విచారకరం. నిర్మాతలు, దర్శకులు ఈ విషయాన్ని గమనించి ఇకనైనా ప్రమోషన్ల శైలిని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. థియేటర్లలో అసలైన విజువల్ వండర్స్ ని ఎంజాయ్ చేసేలా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌లను మిగల్చాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

చివరిగా సినీ ప్రియులు చెప్పేది ఏంటంటే 'ఆకలి అనేది సత్యం, నిజం. అన్నం తినకపోయినా ఏదో ఒక ఐటెం తినాల్సిందే. కానీ కొంత మంది మేకర్స్ అసలు ఆకలి లేని వాళ్ళు కూడా ఉన్నారనుకునే భ్రమలో అతి ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా అనేది చాలా గొప్పది. మధురమైనది, మరుపురానిది. ఈ విశ్వంలో సినిమా ఇచ్చే ఎంటర్ టైన్ మెంట్ ఇంకోటి లేదు.

ఉండి ఉంటే మనకంటే ఎంతో అప్ డేట్ గా ఉండే  హాలీవుడ్ ఎప్పుడో ఇంకో దాన్ని పుట్టించేది. కాబట్టి మధ్యపానం, దుమపానం ఆరోగ్యానికి హానికరం  అని యాడ్స్ ఇవ్వడం కాదు.. అతి ప్రమోషన్స్ కూడా సినిమాకి హానికరమే అని తెలుసుకోండి.

మీకు నచ్చవచ్చు: దాదా సాంగ్ రికార్డ్స్!
మీకు నచ్చవచ్చు:రాజమౌళి నెక్స్ట్ మూవీ అదేనా!

 

 

[cinema, Balakrishna, Chiranjeevi, Nagarjuna, ntr, ram charan]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com