Home

»

Latest News

బిగ్ సర్‌ప్రైజ్‌: మళ్ళీ కెమెరా ముందుకు సీఎం విజయ్.. డైరెక్టర్ ఎవరంటే.?

Nov 6, 2026 4:46PM

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్‌గా వెలిగిన వారు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం చాలా అరుదు. ముఖ్యంగా సినిమాలకే పూర్తిగా గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వారు మళ్లీ నటిస్తామంటే అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు సీఎం, దళపతి విజయ్ విషయంలోనూ ఇదే జరగబోతోందా? అంటే కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం అవుననే అంటోంది.

తమిళ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. తన పూర్తి సమయాన్ని ప్రజాసేవకే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ‘జన నాయగన్’ తన చివరి సినిమా అని ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో విజయాన్ని అందుకుని తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇకపై విజయ్‌ను వెండితెరపై చూసే అవకాశం ఉండదని అభిమానులు భావించారు.

అయితే తాజాగా విజయ్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం రూపొందించనున్న ఓ ప్రత్యేక ప్రచార చిత్రంలో సీఎం విజయ్ స్వయంగా కనిపించబోతున్నారట. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రచార చిత్రానికి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారట. ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ ఏకంగా రెండు రోజుల కాల్షీట్ కూడా కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: శ్రీలీలను టాలీవుడ్‌ పక్కన పెట్టింది.. కోలీవుడ్‌ నెత్తిన పెట్టుకుంటోంది.!

సాధారణంగా ప్రభుత్వ ప్రకటనలు చాలా తక్కువ సమయంలో, పరిమిత బడ్జెట్‌తో రూపొందిస్తుంటారు. కానీ విజయ్ నటించనున్న ఈ యాడ్ ఫిల్మ్‌ను మాత్రం భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రచార చిత్రం కాన్సెప్ట్ ఇంకా బయటకు రాలేదు.

ఇక విజయ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలంటే.. గతంలో వీరిద్దరి కలయికలో ‘యోహాన్: అధ్యం ఒండ్రు’ అనే సినిమా రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది.

మీకు నచ్చవచ్చు:
బాలయ్య ‘దాదా’ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.!
ఒకే ఏడాది మూడు సినిమాలు.. సూర్యను చూసి మన స్టార్స్ మారతారా.?

 

 

 

[Tamil Nadu CM Vijay, Vijay Government Advertisement, CM Vijay Ad Shooting, Thalapathy Vijay, Gautham Vasudev Menon, Vijay Gautham Menon, Vijay Jana Nayagan, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com