Home

»

Latest News

శ్రీలీల హవా: టాలీవుడ్‌ పక్కన పెట్టింది.. కోలీవుడ్‌ నెత్తిన పెట్టుకుంటోంది.!

Nov 6, 2026 4:01PM

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. తెలుగులో వరుస పరాజయాలతో కొత్త అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తున్నా.. కోలీవుడ్ మాత్రం ఈ బ్యూటీకి రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఏకంగా రజినీకాంత్, అజిత్, ధనుష్ వంటి ముగ్గురు స్టార్ నటుల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ‘ధమాకా’ విజయంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. అయితే వరుసగా సినిమాలు చేసినా.. ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఆమె కొత్త సినిమాల జోరు తగ్గినట్లు కనిపిస్తోంది.

కానీ తమిళంలో మాత్రం శ్రీలీలకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే శివకార్తికేయన్‌తో ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు అక్కడి స్టార్ల సినిమాల్లో భాగమవుతోంది.

ముందుగా ధనుష్‌తో ‘ఓం’ సినిమాలో నటిస్తోంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, మమ్ముట్టి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో శ్రీలీల ఒక మిడిల్ క్లాస్ గృహిణి పాత్రలో, ధనుష్ భార్యగా నటిస్తోంది. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి: ఒకే ఏడాది మూడు సినిమాలు.. సూర్యను చూసి మన స్టార్స్ మారతారా.?

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలోనూ శ్రీలీలకు ఛాన్స్ దక్కింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’లో ఆమె భాగమైంది. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే నయనతార, సిమ్రాన్, రాశీ ఖన్నా వంటి ప్రముఖ నటీమణులు ఇందులో ఉన్నారు. తాజాగా శ్రీలీలను కూడా ఆహ్వానిస్తూ మేకర్స్ అధికారికంగా గ్లింప్స్ విడుదల చేశారు.

ఇక అజిత్ కుమార్‌తోనూ శ్రీలీల జతకట్టబోతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డేర్ డెవిల్’ సినిమాలో ఆమె నటించనుంది. నవంబర్ 2న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అజిత్ భార్య షాలిని తన బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇలా ఒకే సమయంలో ధనుష్, రజినీకాంత్, అజిత్ వంటి ముగ్గురు స్టార్ల సినిమాల్లో శ్రీలీల భాగం కావడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్‌గా మారనుంది. టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోయిన శ్రీలీలకు ఇప్పుడు కొత్త సినిమాలు లేకపోవడం ఒకవైపు చర్చనీయాంశంగా మారితే.. మరోవైపు కోలీవుడ్‌లో ఇంతటి భారీ లైనప్ ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. 

మీకు నచ్చవచ్చు:
మహాకాళి ‘అయిగిరి నందిని’ సాంగ్.. ఎనిమిది నిమిషాలు పూనకాలే.!
‘రాకా’ షాకింగ్ అప్డేట్.. 2025లో షూటింగ్ స్టార్ట్.. ఇంకా సగం కూడా పూర్తి కాలేదా.?

 

 

 

[Sreeleela Tamil Movies, Sreeleela Kollywood Lineup, Dhanush Om Movie, Rajinikanth Dharman Movie, Ajith Kumar Dare Devil, Sreeleela, Rajinikanth, Ajith, Dhanush]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com