Home

»

Latest News

శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ప్ర‌త్యేక పూజ‌లు.. తిరుమ‌ల‌లో త‌మ‌న్నా,  ఫోటోలు వైర‌ల్‌.!

Oct 7, 2026 3:00PM

సినీ సెలబ్రిటీలు తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. షూటింగ్స్‌, వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. తాజాగా హీరోయిన్ తమన్నా భాటియా కూడా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

తమన్నా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుని ముందుగా సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత తోమాల, అర్చన సేవల్లోనూ పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి వస్త్రంతో తమన్నాను సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా తమన్నా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఆలయంలో శ్రీవారి సేవల్లో పాల్గొన్న ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అభిమానులు కూడా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమన్నా భక్తిని ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉంటే అదే రోజు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకోగా, తమన్నా మాత్రం తెల్లవారుజామునే సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రస్తుతం తమన్నా తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

 

 

[Tamannaah Bhatia, Tamannaah Tirumala Visit, Tamannaah Tirupati Darshan, Tamannaah Bhatia Tirumala, Tamannaah Latest News, Tamannaah Temple Visit, Tirumala, Tirupati, Tamannaah Family, Tamannaah Spiritual Visit]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com