.webp)
విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' నుంచి విడుదలైన 'గౌరి హెగ్డే' గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం 50 సెకన్ల వ్యవధి కలిగిన ఈ గ్లింప్స్ లో సీనియర్ నటి టబు ఐఆర్ఎస్ అధికారిగా చూపించిన విశ్వరూపం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇన్ కమ్ టాక్స్ డెప్యూటీ కమిషనర్ గౌరి హెగ్డే పాత్రలో టబు కనిపించిన తీరు, ఆమె చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్, చూపించిన బోల్డ్ అండ్ ఫియర్ లెస్ ఆటిట్యూడ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశాయి.
ఈ గ్లింప్స్ ప్రారంభంలోనే పాతబస్తీ వాతావరణంలో ఐటీ దాడుల హంగామా కనిపిస్తుంది. కార్ లో టబు పవర్ ఫుల్ ఎంట్రీ, సిగరెట్ వెలిగించడం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఆఫీసర్స్ రావడం చూసి ఒక లోకల్ పర్సన్.. "ఎవరు మీరు? మా బస్తీకి ఎందుకొచ్చారు?" అంటూ రెచ్చిపోతాడు. దాంతో టబు అతన్ని చెంప దెబ్బ కొట్టి.. "ఈ బస్తీ నీ బాబుదా?" అంటూ రెచ్చిపోతుంది.
ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో లాఠీ పట్టుకుని ఐటీ రైడ్స్ నిర్వహించే లేడీ ఆఫీసర్‌గా టబు స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. రౌడీలకు చెమటలు పట్టిస్తూ, నేరుగా వారి స్థావరాల్లోకి ప్రవేశించి రఫ్ ఆడించే సీన్స్ పూరి జగన్నాథ్ మార్క్ మేకింగ్‌ను ప్రతిబింబిస్తున్నాయి.
గ్లింప్స్ లో విజయ్ సేతుపతి కూడా పవర్‌ఫుల్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఐటీ ఆఫీసర్ గౌరి హెగ్డే, విజయ్ సేతుపతి పాత్రల మధ్య జరిగే సీన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అర్థమవుతోంది.
"మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం... తర్వాత మాట్లాడతాం" అంటూ టబు చెప్పే డైలాగ్, దాని వెనుక ఉన్న ఇంటెన్సిటీ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. అలాగే ఈ టీజర్‌లో "వన్ ఫియర్ లెస్ ఉమెన్", "రూత్ లెస్", "మెర్సిలెస్" అనే క్యాప్షన్స్ గౌరి హెగ్డే క్యారెక్టర్ డెప్త్‌ను స్పష్టంగా సూచిస్తున్నాయి.
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
Actress Tabu, Gauri Hegde, SlumDog Glimpse, Puri Jagannadh, Vijay Sethupathi





