
ఇప్పుడు ఎక్కడ చూసినా మాస్ మహారాజా రవితేజ, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పేర్లు రెగ్యులర్ గా కంటే ఇంకొంచం ఎక్కువగా మారుమోగిపోతున్నాయి. ఇందుకు కారణం ఇరుముడి మూవీ. టైటిల్ కి ఉన్న పవర్ నో, లేక మూవీ స్టార్ట్ చేసిన టైం వేళా విశేషమో తెలియదు గాని ఇరుముడి పై ఏర్పడిన క్రేజ్ ఈ మధ్య కాలంలో మరో సినిమాకి రాలేదనే చెప్పాలి. ఈ నెల 21 న రవితేజ కెరీర్ లోనే వరల్డ్ వైడ్ గా అంతకు మించి అనే రీతిలో విడుదల కానుంది.
రవితేజ తన తదుపరి చిత్రం దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేయబోతునట్టుగా టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు..అసలు వివేక్ ఆత్రేయ మొదట గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కోసం కథ సిద్ధం చేసి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా పొందినట్లు ప్రచారం జరిగింది. అయితే బాలయ్య తన రాజకీయ మరియు ఇతర సినిమా కమిట్‌మెంట్లతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశం కనిపించింది. దాంతో ఈ గ్యాప్‌ని వృథా చేయకూడదనే ఉద్దేశంతో వివేక్ ఆత్రేయ రవితేజకి కథ వినిపించడం, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి మైత్రి మూవీ మేకర్స్ తప్పుకున్నట్టుగా టాక్ .మైత్రీ లాంటి బడా ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు తప్పుకుందనే విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి స్పష్టత రాలేదు.
Also Read: దొరికేసాడు: శంకర్ నెక్స్ట్ హీరో, ఈ స్టార్ హీరోనే!
అయితే మైత్రీ సంస్థ నుంచి బయటకు వచ్చిన లక్ష్మణ్ ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సంస్థతో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్న లక్ష్మణ్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను టేకోవర్ చేయడానికి సిద్ధమవడం టాలీవుడ్‌లో సరికొత్త ట్విస్ట్‌గా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త నిర్మాణ సంస్థ వివరాలతో పాటు పూర్తి తారాగణం, టెక్నీషియన్ల వివరాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
RaviTeja, Irumudi, Mythri Movie Makers, Tollywood
.webp)





.webp)
