Home

»

Latest News

తాప్సీ 'మొగుడు' గోపీచంద్

Mar 21, 2011 6:08PM

tapsi wallpapers, tapsi stills, tapsi images, tapsi pics, tapsi photos, tapsi pictures తాప్సీ 'మొగుడు' గోపీచంద్ అంటే వింటానికే ఇబ్బందిగా ఉందికదూ. తాప్సీ 'మొగుడు' గోపీచంద్ నిజంగా కాదులెండి. కృష్ణ వంశీ దర్శకత్వంలో, గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం"మొగుడు". ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్ గా నటించటానికి అంగీకరించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించటం ఇదే తొలిసారి. తాప్సీ గతంలో మంచు మనోజ్ కుమార్ సరసన "ఝుమ్మంది నాదం" చిత్రంలోనూ, మంచు విష్ణు వర్థన్ సరసన "వస్తాడు నారాజు" వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

ఈ రెండు చిత్రాలూ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, నటిగా తాప్సీకి మంచి పేరు లభించింది. అలాగే గోపీచంద్ ఇటీవల హీరోగా నటించిన "వాంటెడ్" చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాపయ్యింది. అందువల్ల మళ్ళీ ప్రేక్షకాభిమానం సంపాదించాలంటే గోపీచంద్ కి కూడా తప్పని సరిగా ఒక హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com