ENGLISH | TELUGU  

Taapsee vs modi..మోదీ పై సెటైరికల్ కామెంట్స్ చేసిన తాప్సీ.. వాట్ నెక్స్ట్ 

on Feb 16, 2026

 


-మోదీ పై తాప్సీ ఆ విధంగా ఎందుకు మాట్లాడింది
-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మాటలు 
-ఫ్యాన్స్ ఏమంటున్నారు

 

ఒక వైపు దేశప్రధానమంత్రి మోదీ(Modi)..మరో వైపు ప్రముఖ హీరోయిన్ తాప్సీ(Taapsee).. ఇదేంటి కొత్తగా ఈ ఇద్దరి పేర్లు చెప్తున్నారు. మోదీ పాలన, ఆశయాలు నచ్చి తాప్సీ రాజకీయ తీర్ధం ఏమైనా పుచ్చుకోనుందా అని అనుకుంటున్నారా! అలాంటిదేమి లేదు.కాకపోతే రీసెంట్ గా  మోదీ గురించి  తాప్సీ కొన్ని వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యాఖ్యలతో పాటు అందుకు సంబంధించిన వీడియో  దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. మరి తాప్సీ ఏమని మాట్లాడిందో చూద్దాం.


 రీసెంట్ గా తాప్సీ ఒక ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. యాంకర్ డిస్ ప్లే లో మోదీ, రాహుల్ గాంధీ పిక్స్ ని ఉంచి, ఆ ఇద్దరిలో మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరని తాప్సీ ని అడగడం జరిగింది. దాంతో  తాప్సీ చిరు నవ్వుని ప్రదర్శిస్తు మోదీ ఫోటో వైపు చూపిస్తూ చేతులు జోడించి నమస్కారం చేశారు. అనంతరం పిక్ దగ్గరకి వెళ్లి నాకు ఇంకా ఈ దేశంలోనే ఉండాలని ఉందంటూ కొంచం చమత్కార ఉద్దేశ్యంతోనే చెప్పినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. దీంతో మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ దేశంలో ఉండనివ్వరన్న ఉద్దేశంతోనే తాప్సీ ఆ విధంగా మాట్లాడిందనే కామెంట్స్ తో సోషల్ మీడియా కళకళలాడుతూ ఉంది. అభిమానులు మాత్రం ఆమె ప్రవర్తనలో ఎలాంటి వ్యంగం లేదని, కొంత మంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారనే అభిపాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

Also read:  ప్రభాస్ కి గాయాలు! ఎందుకు అయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు

 

తెలుగు సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడితే కెరీర్ జెట్ స్పీడ్ వేగంతో ముందుకు వెళ్తుందని నిరూపించిన వాళ్లలో తాప్సీ కూడా ఒకరు.2010 లో ఝుమ్మంది నాదంతో తెరంగ్రేటం చేసి ఆ తర్వాత గ్యాప్ అనేది లేకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో అస్సి.,వొ లడ్కి హై కహాన్, గాంధారి వంటి చిత్రాలు ఉన్నాయి. 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.