Home

»

Latest News

77 లో ఏముంది రవితేజ.. ఫస్ట్ టైం ఎందుకు ఇంత పాజిటివ్ 

Feb 16, 2026 12:47PM

 

 

  
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-ఆ విషయంలో బహుశా ఇదే ఫస్ట్ అనుకుంటా 
-ఇక నో డౌట్స్ 
-కావేరి పిక్ సూపర్ 


మహిమలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, సినీ మహిమ మాత్రం అప్పుడప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. రవితేజ(Ravi Teja)అప్ కమింగ్ ప్రాజెక్ట్ 'ఇరుముడి'(Irumudi)నే అందుకు ఉదాహరణ. ఈ చిత్రం ప్రకటించినప్పట్నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ 'వైఫె' లా ఇరుముడి ని అంటిపెట్టుకుని ఉండిపోయాయి. ఈ మధ్య కాలంలో ఇంతలా పాజిటివ్ ని ఏర్పరుచుకున్న సినిమా రాలేదనే చెప్పాలి. అందుకే ఇరుముడి మూవీలో ఏదో మహిమ దాగి ఉందనే అభిప్రాయాన్ని అందరు వ్యక్తం చేస్తుంటారు. ఆ మాట అక్షరాలా నిజమని చెప్పేలా మేకర్స్ నిన్న మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన రవితేజ,ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar)పోస్టర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఆ వివరాలు చూద్దాం.   

 ప్రియా భవాని శంకర్.. సౌత్ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో దూసుపోతుంది. ఇప్పుడు   ఇరుముడి లో కావేరి అనే రోల్ లో కనిపించనుంది.  హోమ్లీ లుక్ లో ఉన్న ప్రియా  చెంపలపై రవితేజ ముద్దు పెడుతుంటే ప్రియా చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తుంది. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ ఒక్క పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుండటంతో పాటు పక్కా హిట్ అనే అభిప్రాయాన్ని అభిమానులు, నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. రవితేజ చేస్తున్న 77 వ మూవీలో ఏదో మహిమ దాగి ఉందనే కామెంట్స్ కూడా చేస్తుండటం గమనార్హం.

Also read:  Taapsee vs modi: మోదీ పై సెటైరికల్ కామెంట్స్ చేసిన తాప్సీ.. వాట్ నెక్స్ట్ 

 

నిన్ను కోరి,మజిలీ ఫేమ్ శివ నిర్వాణ(Siva Niravana)దర్సకత్వంలో తండ్రి,కూతురు మధ్య అనుబంధాలతో ముడిపడిన యాక్షన్ ఎంటర్ గా ఇరుముడి ముస్తాబవుతోంది.మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)భారీ వ్యయంతో నిర్మిస్తుండగా పలువురు క్రేజీ నటులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటికే  పాపని ఎత్హుకుని నెత్తిన ఇరుముడి ధరించి ఉన్న రవితేజ పిక్ బయటకి వచ్చిన విషయం తెలిసిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com