Home

»

Latest News

`విశ్వ‌సుంద‌రి` సుస్మితా సేన్ సినీ ప్ర‌స్థానానికి పాతికేళ్ళు!

Nov 29, 2021 10:35AM

భార‌త‌దేశం త‌రపున `మిస్ యూనివ‌ర్శ్` టైటిల్ గెలిచిన మొద‌టి మ‌హిళ‌గా సుస్మితా సేన్ కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుతోనే సినీ న‌టిగా అవ‌కాశాలు పొంది త‌న‌దైన అభిన‌యంతో అల‌రించారు సుష్. హిందీ, త‌మిళ‌, బెంగాలీ భాష‌ల్లో ప‌లు విభిన్న పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం `ఆర్య‌` సిరీస్ తో ఓటీటీలోనూ త‌న మార్క్ వేస్తున్నారు ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.

ఇదిలా ఉంటే.. సుస్మితా సేన్ న‌టించిన మొట్టమొద‌టి సినిమా `ద‌స్త‌క్` (హిందీ) విడుద‌లై నేటికి స‌రిగ్గా పాతికేళ్ళు అవుతోంది. అగ్ర ద‌ర్శ‌కుడు మ‌హేశ్ భ‌ట్ రూపొందించిన ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో నిజ జీవిత పాత్ర‌లోనే అంటే `మిస్ యూనివ‌ర్శ్` పాత్ర‌లోనే క‌నిపించారు సుష్. సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయినా.. సుస్మిత అందం, అభిన‌యం ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేసింది. ఆపై మ‌రో 34 సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌ల్లోనూ, స‌హాయ పాత్ర‌ల్లోనూ, ప్ర‌త్యేక గీతాల్లోనూ ద‌ర్శ‌న‌మిచ్చి అలరించారీ విశ్వ సుంద‌రి. సుస్మిత న‌టించిన చిత్రాల్లో `బీవీ నంబ‌ర్ 1`, `సిర్ఫ్ తుమ్`, `ఆంఖేన్`, `మై హూ నా` మంచి విజ‌యం సాధించ‌గా.. త‌మిళ చిత్రం `ముద‌ల‌వ‌న్` (ఒకే ఒక్క‌డు)లో చేసిన ప్ర‌త్యేక గీతం ``ష‌క‌ల‌క బేబి`` అప్ప‌టి కుర్ర‌కారుని ఉర్రూత‌లూగించింది.

మ‌రి.. పాతికేళ్ళుగా త‌న‌దైన అభిన‌యంతో ముందుకు సాగుతున్న సుష్.. మున్ముందు మ‌రిన్ని వైవిధ్య‌భ‌రిత‌ పాత్ర‌ల్లో ఎంట‌ర్టైన్ చేస్తారేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com