Home

»

Latest News

బాల‌య్య - అనిల్ రావిపూడి చిత్రానికి ముహూర్తం ఫిక్స్!

Nov 29, 2021 11:13AM

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ద‌ర్శ‌కుల్లో అనిల్ రావిపూడి ఒక‌రు. `ప‌టాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సంచ‌ల‌నం సృష్టించిన ఈ యంగ్ డైరెక్ట‌ర్.. త్వ‌ర‌లో `ఎఫ్ 3`తో డబుల్ హ్యాట్రిక్ కి సిద్ధ‌మ‌వుతున్నారు. విక్ట‌రీ వెంక‌టేశ్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ్రీన్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 25న థియేట‌ర్స్ లోకి రాబోతోంది.

ఇదిలా ఉంటే.. `ఎఫ్ 3` త‌రువాత న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయ‌బోతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. జూలై నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ట‌. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి 2023 సంక్రాంతికి సినిమాని జ‌నం ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు స‌మాచారం. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, బాల‌య్య తాజా చిత్రం `అఖండ‌` డిసెంబ‌ర్ 2న రిలీజ్ కాబోతోంది. ఆపై `క్రాక్` ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేనితో సినిమా చేయ‌బోతున్నారాయ‌న‌. అది రిలీజ‌య్యేలోపే అనిల్ కాంబో మూవీ ప‌ట్టాలెక్కుతుంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com