Home

»

Latest News

Karuppu: సూర్య, ఆర్ జె బాలాజీ మధ్య గొడవ.. ఇప్పటికి 300 కోట్లు అంట 

May 30, 2026 6:27PM

 


కరుప్పు(Karuppu)అలియాస్ వీరభద్రుడు(Veerabhadrudu)ఎంటైర్ తన కెరీర్ కే సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుందని సూర్య(Suriya)అసలు ఉహించి ఉండడు. కేవలం పదిహేను రోజులకే వరల్డ్ వైడ్ గా 300 కోట్ల గ్రాస్ ని సాధించిందంటే మాములు విషయమా చెప్పండి. అభిమానులు సంబరాలు చేసుకుంటున్న టైంలో దర్శకుడు ఆర్జే బాలాజీ కరుప్పుకి సంబంధించిన ఒక అత్యంత ఆసక్తికరమైన  షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.

ఆర్జే బాలాజీ(RJ Balaji)మాట్లాడుతూ, షూటింగ్ సమయంలో సూర్య నాతో ఒక డైలాగ్ విషయంలో తీవ్రంగా విభేదించారు. మొదట్లో సూర్య సార్ ఆ పర్టిక్యులర్ డైలాగ్ చెప్పడానికి అస్సలు సిద్ధంగా లేరని, ఆ సీన్ వద్దే వద్దని గొడవపడ్డారు. తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా తానే ఆయన్ని చాలా బలవంతం చేశానని, తన గత హిట్ సినిమాలైన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) వంటి చిత్రాల ఉదాహరణలను చెప్పి ఎలాగోలా ఒప్పించాల్సి వచ్చింది. అయినప్పటికీ సూర్య సార్ మాత్రం ఆ డైలాగ్ మనకొద్దు అని పదే పదే చెప్తూనే వచ్చారు. దీనివల్ల ఇండస్ట్రీలో ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందారు.

అసలు ట్విస్ట్ ఏంటంటే, రిలీజ్ కి వారం ముందే ఫైనల్ కట్ చూసిన తర్వాత కూడా సూర్య సార్ ఆర్జే బాలాజీ దగ్గరికి వచ్చి, ఆ డైలాగ్‌ను సినిమా నుండి పూర్తిగా తీసేయమని గట్టిగా పట్టుబట్టారు. "మన సినిమాల్లో ఇతరుల చిత్రాలని  గానీ, వారి వ్యక్తిగత విషయాలను గానీ ఎగతాళి చేయకూడదు, అది పద్ధతి కాదు" అని అన్నారు.వేరొకరిని నొప్పించడం ఇష్టం లేక అంతలా వాదించారు. ఆయన నిజంగానే చాలా గొప్ప సంస్కారం ఉన్న మంచి వ్యక్తి . అయితే నేను   మాత్రం మొండిగా నిలబడి మూకుత్తి అమ్మన్ కి దర్శకత్వం వహించింది నేను సార్.. నా నమ్మకాన్ని నమ్మండి, ఏమీ పర్లేదు, నేను చూసుకుంటా అని చెప్పి ఆ సీన్‌ని, డైలాగ్ ని  అలాగే ఉంచాం.

Also read: kushboo: ఖుష్బూ కూతురి పెళ్లి.. మోదీ ఆశీస్సులు  

చివరకి థియేటర్లలోకి సినిమా వచ్చాక నా  నమ్మకమే నిజమైంది. ఆ పర్టిక్యులర్ డైలాగ్‌కి థియేటర్లన్నీ చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయాయి. ప్రేక్షకులు ఆ సీన్‌ని చాలా బాగా  ఎంజాయ్ చేస్తున్నారని బాలాజీ ఆనందం వ్యక్తం చేశారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com