Home

»

Latest News

శంకర్‌కు కష్టాలు..

Oct 4, 2016 11:47AM

రోబో సినిమాకు సీక్వెల్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంభినేషన్లో వస్తోన్న మూవీ 2.0. ఇప్పటికే రోబో-1 ప్రపంచ స్థాయిలో భారీ హిట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు శంకర్, రజనీకాంత్ కాంభినేషన్ కావడంతో ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు  శంకర్. ఈ మూవీకి సంబంధించి కనీసం ఒక్క న్యూస్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు. షూటింగ్ స్పాట్‌లో ఎవ్వరూ మొబైల్ తీసుకురాకుండా..బయట వారికి ఎలాంటి అనుమతి రాకుండా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాడట. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 2.0కు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వస్తుండటంతో శంకర్ ఆందోళన చెందుతున్నాడు. ఆ మధ్య ముంబైలో షూటింగ్ సందర్భంగా విలన్‌గా నటిస్తున్న అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. సరిగ్గా 2.0 ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తుండగానే సోషల్ మీడియాలో ఓ ఫస్ట్‌లుక్ విడుదల కావడంతో శంకర్ ఆశ్చర్యానికి గురవుతున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com