అల్లు అర్జున్ DJ ఫస్ట్ లుక్ లీక్..!
on Oct 4, 2016
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైల్‌కు పర్యాయపదంలా మారిన వ్యక్తి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా సినిమాకు కొత్త స్టైల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. సిక్స్ ప్యాక్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ ఇలా అన్నిటిని తెలుగువారికి రుచి చూపించింది అల్లు వారబ్బాయి. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ నటిస్తోన్న చిత్రం దువ్వాడ జగన్నాథం. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది..అయితే ఈసారి స్టైలిష్ స్టార్ ఎలా కనిపించబోతున్నాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ గెటప్‌కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్లాక్ గాగూల్స్ పెట్టి, హెయిర్‌ని ట్రిమ్ చేసి మిడిల్ క్రాఫ్‌తో అల్లు అర్జున్ అదిరిపోతున్నాడు...మరి అభిమానులూ ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఈ న్యూ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. అన్నట్లు ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ముకుంద చిత్రలో నటించిన పూజా హెగ్డే బన్నీతో ఆడిపాడనుంది.