సన్నీ లియోన్ కు సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్లు..!
on Apr 11, 2016
బాలీవుడ్ లో దుమ్ము రేపుతున్న భామ సన్నీ లియోన్ కు బెంగుళూర్ లో చిన్న సర్ప్రైజ్ ఎదురైంది. తను నటించిన వన్ నైట్ స్టాండ్ సినిమా ప్రచారంలో భాగంగా, భర్త డేనియల్ తో కలిసి బెంగుళూరు చేరుకున్న సన్నీ లియోన్ కు అక్కడి హోటల్ స్టాఫ్ సడెన్ పార్టీ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఆదివారం సన్నీ దంపతుల పెళ్లి రోజు. ఆ విషయం తెలిసి, ముందుగానే రెడీ అయిన హోటల్ యాజమాన్యం, వాళ్లకు ఒక గుర్రపు బండిని ఏర్పాటు చేసి పూలదండలతో వెల్ కం చెప్పింది. లోపలికి రాగానే కేక్ కటింగ్ కూడా చేయించడంతో, సన్నీ, డేనియల్ ఆనందానికి హద్దే లేదు. సన్నీ లియోన్ ఆనందంలో ఏడ్చేసిందట. హోటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు సన్నీ తన ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేసింది.