బయ్యర్ల కోసం ఇష్టం లేకపోయినా చేసిన పవన్..!
on Apr 11, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజైన మూడు రోజుల తర్వాత గానీ పవన్ ఇంటర్వ్యూలు మీడియా రాలేదు. సరిగ్గా ఆలోచిస్తే ఇందులో లాజిక్ వెంటనే అర్ధమైపోతుంది. పవన్ కు మీడియా అన్నా, పబ్లిసిటీ అన్నా చాలా ఇబ్బంది. అందుకే వీటికి చాలా దూరంగా ఉంటారు. హిందీలో ఫస్ట్ టైం కాబట్టి, అక్కడి వాళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ తెలుగులో ఆయన క్రేజ్ తోనే సినిమా ఆడేస్తుంది కాబట్టి అలాంటి ప్రమోషన్లేమీ ప్లాన్ చేయకుండా తనకు అలవాటైన రీతిలో దూరంగా ఉన్నారు పవర్ స్టార్. కానీ సినిమా రిలీజై డివైడ్ టాక్ వస్తుండటంతో, సినిమాను భారీగా డబ్బు పెట్టి కొనుక్కున్న బయ్యర్లు ఇంకో రెండు రోజుల్లో పరిస్థితి మెరుగవ్వకపోతే లబోదిబోమనే పరిస్థితి.
దీంతో పవన్ కు తప్పలేదు. తనకు ఇష్టం లేకపోయినా, స్వయంగా కొన్ని టాప్ మీడియా హౌస్ లను పిలిచి ఇంటర్వ్యూలిచ్చారు. చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురౌతాయని తెలిసి కూడా వేరే ఆప్షన్ లేక ఫేస్ చేశారు. సినిమా రిలీజైన తర్వాత పవన్ ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక రీజన్ ఇదే. ఎలాగైనా సినిమా పికప్ అయి బయ్యర్లు సేఫ్ అవ్వాలనేది పవన్ కోరిక. వచ్చే వారం వరకూ సర్దార్ హాళ్లలో నిలబడితే, బయ్యర్లు కనీసం సగమైనా రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం పోలీసోడు, ఈడోరకం ఆడోరకం సినిమాలు హాళ్లల్లో ఎంటరౌతున్నాయి. ఒకవేళ వీటి కంటే సర్దార్ బెటర్ అనే టాక్ వస్తే, మళ్లీ సర్దారోడికి కాస్త కలెక్షన్ స్పెస్ దొరుకుతుంది. చివరికి సర్దార్ కలెక్షన్లు లెక్క ఎంత తేలబోతుందో చూడాల్సి ఉంది.