Home

»

Latest News

జర్నలిస్టుకు లాగి ఒక్కటిచ్చిన సన్నీలియోన్

Mar 25, 2016 3:23PM

సెలబ్రిటీలను ఇష్టం వచ్చినట్టు అడక్కూడదని ఆ జర్నలిస్ట్ కు అర్ధమై ఉంటుంది. ఇప్పటికే ఒకసారి పబ్లిగ్గా ఒక రిపోర్టర్ అడిగిన పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ కు చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్న సన్నీ లియోన్, ఈసారి మాత్రం మిస్ అవలేదు. ఒక రాత్రికి ఎంత తీసుకుంటున్నారంటూ ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కు ఒళ్లు మండి లాగి చెంప పగలకొట్టింది సన్నీ. విషయంలోకి వెళ్తే, హోలీ కోసం గుజరాత్ లోని సూరత్ లో, ఒక ప్రైవేట్ కార్యక్రమంలో డ్యాన్స్ వేయడం కోసం సన్నీ ఒప్పుకుంది.

భర్తతో కలిసి హోటల్ కు చేరుకున్న సన్నీ గదిలోకి ఒక ఆగంతకుడు దూసుకొచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. సిబ్బంది అతన్ని పోలీసులు అప్పగించిన తర్వాత, ఆమె ప్రోగ్రామ్ కు బయలుదేరింది. అప్పటికే ఇంటర్వ్యూ కోసం హోటల్ కు చేరుకున్న ఉన్న జర్నలిస్ట్, ఇంటర్వ్యూ మధ్యలో అడక్కూడని ఆ ప్రశ్న అడిగేసరికి, విసిగిపోయి ఉన్న సన్నీ లాగి ఒక్కటిచ్చింది. అంతేకాక, జర్నలిస్టులందర్నీ బయటికి పంపించే వరకూ, తన ప్రదర్శన స్టార్ట్ చేయలేదు. ఈవెంట్ నిర్వాహకులు విలేకర్లందరినీ పంపించిన తర్వాత మొదలైన ఈవెంట్, నైట్ వరకూ అలరించింది. కానీ ఇకపై మళ్లీ గుజరాత్ రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానని సన్నీ చెప్పడం కొసమెరుపు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com