Home

»

Latest News

ఊపిరి సినిమా గురించి రాజమౌళి సంచలన ట్వీట్..!

Mar 25, 2016 3:53PM

ఈరోజు రిలీజైన ఊపిరి మూవీ ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఊపిరి మైలేజ్ కు యాడ్ అయ్యే కాంప్లిమెంట్ మూవీ టీంకి లభించింది. నిజంగా మంచి సినిమా అయితే, ఏమాత్రం సంకోచించకుండా వెంటనే అభినందించే దర్శక ధీరుడు రాజమౌళి, ఊపిరి టీంను మనసారా అభినందించారు. తనకు ఇంటచిబుల్స్ మూవీ చాలా ఇష్టమని, నిజానికి వంశీ ఈ సినిమాను ఇంత బాగా తెరకెక్కించగలడని తను అనుకోలేదని, కానీ తన భావన తప్పు అని వంశీ పైడిపల్లి ప్రూవ్ చేశాడని మనసులో మాటను నిర్భయంగా ట్వీట్ చేశాడు జక్కన్న. ఫ్రెంచి సన్నివేశాలను అద్భుతంగా మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చాడని వంశీని పొగడ్తల్లో మంచెత్తాడు. అంతేకాక కార్తీ, నాగార్జునలు అద్భుతంగా చేశారంటూ ప్రశంసించాడు. చాలా రోజుల తర్వాత మంచి సినిమాను చూశానని, ఎవరూ మిస్ అవద్దని ట్వీట్ చేశాడు దర్శక బాహుబలి. ఆల్రెడీ మొదటి షో తర్వాత హిట్ టాక్ తెచ్చేసుకున్న ఊపిరికి, రాజమౌళి ట్వీట్ మరింత ఊపిరి ఊదుతుందనడంలో సందేహం లేదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com