Home

»

Latest News

Suniel Narang: సునీల్ నారంగ్ వాట్సాప్ డీపీ.. ఎవరిని ఉద్దేశించి ఆ వార్నింగ్?

May 14, 2026

టాలీవుడ్ లో నెలకొన్న 'నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు' వివాదం కాస్తా.. 'నాగవంశీ వర్సెస్ సునీల్ నారంగ్'గా మారిన విషయం తెలిసిందే. ఎన్నో మల్టీప్లెక్స్ లను కలిగి ఉన్న సునీల్ నారంగ్.. సింగిల్ స్క్రీన్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని నాగవంశీ అన్నారు. తాను సింగిల్ స్క్రీన్లు కూడా నిర్మించానని, తనకు మాట్లాడే హక్కు ఉందని సునీల్ నారంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా, ‘డూప్లికేట్ విగ్ ఫెలో’ అంటూ నాగవంశీని పర్సనల్ గా టార్గెట్ చేశారు సునీల్. (Suniel Narang)

ఇక తాజాగా సునీల్ నారంగ్ వాట్సాప్ డిస్ ప్లే పిక్చర్ (DP) గా పెట్టిన ఒక కొటేషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సునీల్ నారంగ్ తన వాట్సాప్ డీపీలో తన తండ్రి, దివంగత నారాయణదాస్ నారంగ్ నేర్పిన పాఠాన్ని గుర్తు చేసుకుంటూ ఒక పవర్‌ఫుల్ కొటేషన్‌ను షేర్ చేశారు. "MY FATHER TAUGHT ME ONE THING. Never start fight first but if they force you, Destroy them..." అనే కొటేషన్‌ ఆ ఫొటోలో ఉంది. 

దీని అర్థం ఏమిటంటే.. "మా నాన్న నాకు ఒక విషయం నేర్పారు.. ఎప్పుడూ ముందుగా గొడవ మొదలుపెట్టకు, కానీ వాళ్లే నిన్ను గొడవలోకి లాగితే మాత్రం వాళ్ళని నామరూపాలు లేకుండా చేసేయ్". ఈ ఘాటు హెచ్చరిక ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ మెసేజ్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు? ఆయన అంతలా ఎందుకు స్పందించారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

నారాయణదాస్ నారంగ్ గారు ఇండస్ట్రీలో ఎంతో గౌరవప్రదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వారసుడిగా సునీల్ నారంగ్ కూడా అదే హుందాతనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాజా కామెంట్స్, వాట్సాప్ డీపీ చూస్తుంటే.. సునీల్ నారంగ్ గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com