.jpg)
సందీప్ కిషన్ ఎప్పుడూ హుషారుగా వుంటాడు. అతడి నటనలో చురుకు వుంటుంది. కానీ, ఎందుకో విజయం అనే మాట అతడి దరి చేరడం లేదు. వరుస పరాజయాలు యువ హీరోల రేసు నుంచి అతణ్ణి పక్కకు తప్పించాయి. అయితే... పట్టు వదలని విక్రమార్కుడిలా సందీప్ కిషన్ సినిమాలు చేస్తున్నాడు. నిర్మాతగా కూడా మారాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, తన స్థాపించిన నిర్మాణ సంస్థ వెంకటాద్రీ టాకీస్ పతాకంపై నిర్మించిన సినిమా ‘నిను వీడని నీడను నేనే’. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సూపర్ నేచురల్ కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నామని ప్రకటించారు. పగిలిన గ్లాస్.. గ్లాస్ కింద రక్తపు ప్రవాహంలో హీరోయిన్.. గ్లాస్ పైన సందీప్ కిషన్... కాస్త కొత్తగా లుక్‌ను డిజైన్ చేశారు. ప్రేక్షకులను ఈ లుక్ ఆకట్టుకుంటోంది. మరి, ఈ సినిమాతోనైనా సందీప్‌కి విజయం వస్తుందో? లేదో? చూడాలి.
హీరోలు నిర్మాతలుగా మారి తీసిన చాలా సినిమాలు విజయాలు సాధించాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మించిన ‘ఖైదీ నంబర్ 150’ హిట్టే. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో సుధీర్‌బాబు నిర్మాతగా మారాడు. విజయం అందుకున్నాడు. నిర్మాతగా మహేశ్‌బాబు, నితిన్, సిద్ధార్థ్ తదితరులు విజయాలు అందుకున్నారు. ‘యన్.టి.ఆర్’తో నిర్మాతగా మారుతున్న బాలకృష్ణ, ‘నిను వీడని నీడను నేను’తో సందీప్ కిషన్ విజయాలు అందుకుంటారో? లేదో? చూడాలి!!






