
ఎదుటివాళ్లను వెక్కిరించమంటే వర్మకు సరదా! ఇతర సినీ ప్రముఖులపై విమర్శలు చేసి... పరిశ్రమలో, ప్రేక్షకుల్లో విమర్శల గురించి జరుగుతున్న చర్చను ఆస్వాదిస్తారు. తాజాగా రజనీకాంత్ హీరోగా, అక్షయ్‌కుమార్ యాంటీ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ ‘2.ఓ’ మీద విమర్శలు చేశారు వర్మ. ‘2.0’ను చిన్న పిల్లల సినిమాగా వర్ణించారు. ఇది శంకర్‌ను వెక్కిరించడమే. కొన్ని రోజులగా వర్మ పదే పదే ‘2.ఓ’ గురించి మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే... నవంబర్ 29న ‘2.ఓ’ విడుదలవుతోంది.

30న వర్మ నిర్మించిన ‘భైరవ గీత’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. అందుకని, రెండు సినిమాల మధ్య పోలికలు తీసుకొస్తున్నారు వర్మ. శుక్రవారం రాత్రి జరిగిన ‘భైరవ గీత’ ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లో వర్మ మాట్లాడుతూ ‘‘చాలా పెద్ద దర్శకుడు చిన్న పిల్లల కోసం తీసిన సినిమా ‘2.ఓ’ అయితే... చాలా చిన్న దర్శకుడు పెద్దల కోసం తీసిన సినిమా ‘భైరవగీత’. ఎవరి దగ్గర అసిస్టెంట్‌గా పని చేయని సిద్ధార్థ్ ‘భైరవ గీత’ను గొప్పగా తీశాడు’’ అన్నారు. ‘2.ఓ’ను చిన్న పిల్లల చిత్రమనీ, తమది పెద్దల కోసం తీసిన చిత్రమనీ చెప్పడం ద్వారా ప్రేక్షకులను తమ ‘భైరవ గీత’ను చూడమని చెబుతున్నారు వర్మగారు. అదీ సంగతి!





.jpg)
