Home

»

Latest News

అందరు కలిసి డైరెక్ట్ చేసారు భయ్యో: మొత్తం ఎంత మందో తెలుసా!

Sep 30, 2026 5:07PM


దేశంలో రైతులు ఎక్కువ అవ్వాలసింది రైటర్స్ ఎక్కువ అయ్యారనే మాట అప్పుడపుడు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. మరి  అయ్యారో లేదో గాని ఒక సినిమాకి మాత్రం మెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ వర్క్ చేసారు. 

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సందీప్ కిషన్ అక్టోబర్ 2 న 'సిగ్మా' తో వస్తున్న విషయం తెలిసిందే. సందీప్ గతంలో ఒక కొత్త దర్శకుడికి నమ్మకంతో అవకాశం ఇచ్చాడు. కానీ షూటింగ్ జరిగిన రెండో రోజు నుంచే సినిమా చెయ్యలేకపోతున్నానని, భయమేస్తుందని ఆ దర్శకుడు ఒకటే  ఏడుపు మొదలు పెట్టాడు.. కెమెరా కోణాలు, నటీనటుల టైమింగ్స్, రోజువారీ షూటింగ్ షెడ్యూల్‌‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియకపోవడమే అందుకు కారణం. 

సాధారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ హీరో అయినా లేదా నిర్మాత అయినా తీవ్ర అసహనానికి గురై సినిమాను మధ్యలోనే ఆపేయడమో లేదా ఆ దర్శకుడిని అర్ధాంతరంగా తొలగించడమో చేస్తారు. కానీ, అప్పటికే ప్రారంభమైన సెట్ ఖర్చులు, యూనిట్ సభ్యుల కష్టం వృథా కాకూడదనే ఉద్దేశంతో సందీప్ కిషన్ మరియు ఆ చిత్ర నిర్మాత ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దర్శకుడిని పక్కన పెట్టకుండానే, సెట్‌లో ఉన్న టెక్నీషియన్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరామెన్, చివరికి హీరో సందీప్ కిషన్ తో సహా అందరూ కలిసి ఆ సీన్‌ను ఎలా డిజైన్ చేయాలో ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఒక సీన్ పూర్తి చేయాలంటే ప్రతీ ఒక్కరూ తమ సూచనలు, సలహాలు ఇస్తూ, పరస్పరం సహకరించుకుంటూ ప్రతి షాట్‌  పూర్తి చేశారు.

ఇది కూడా చదవండి: ఫిలిం ఛాంబర్ ఎదుట తెలంగాణవాదుల ఆందోళన: అతన్ని తీసెయ్యాలి!

 

 

ఈ విధంగా సినిమా సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములై, నిజానికి వాళ్లెవరూ అధికారికంగా దర్శకులు కాకపోయినా, ఒక టీమ్‌గా పనిచేసి ఆ సినిమాను విజయవంతంగా పూర్తిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు సెట్‌లో ఉన్న మొత్తం యూనిట్ అంతా కలసి ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేశారని చెప్పవచ్చు.  అందుకే అంటారు డైరెక్టర్ ని అని చెప్పుకునే ప్రతి వాళ్ళు డైరెక్టర్ అవ్వలేరు. మౌనంగా ఉంటే మేధావి అని కూడా అనుకోకూడదు. పిచ్చోళ్ళు కూడా మౌనంగానే ఉంటారు.


[Sundeep Kishan Movie Directed By Entire Unit, Sundeep Kishan, Tollywood Movie News, Telugu Cinema Gossips, Movie Unit Directed, Sigma, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com