Home

»

Latest News

ట్రైల‌ర్ రివ్యూ : న‌రుడా డోన‌రుడా

Sep 27, 2016 2:30PM

అక్కినేని ఇంటి నుంచి వ‌చ్చిన మ‌రో హీరో... సుమంత్‌. ఒడ్డూ పొడ‌వూ ఉన్నా, చేతిలో పేరున్న నిర్మాణ సంస్థ‌, త‌న వెనుక ఓ గొప్ప కుటుంబం ఉన్నా.. స‌రైన విజయం లేక డీలా ప‌డ్డాడు. త‌న నుంచి ఓ సినిమా వ‌చ్చి ఏళ్ల‌కు ఏళ్లు అయిపోయింది. ఇన్నేళ్ల గ్యాప్ త‌ర‌వాత చేసిన సినిమా.. న‌రుడా - డోన‌రుడా. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం  విక్కీ డోన‌ర్‌కి తెలుగు రీమేక్ ఇది. ప‌ల్లవి సుభాష్ క‌థానాయిక గా న‌టించిన ఈ చిత్రానికి మ‌ల్లిక్ రామ్ ద‌ర్శకుడు.  ఈరోజు ట్రైల‌ర్ మ‌హేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమా క‌థేంటి?  హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఏమిటి?  అనే విష‌యాల్ని చూపిస్తూ సాగిన ట్రైల‌ర్ ఇది.

బాలీవుడ్ సినిమా విక్కీ డోన‌ర్ చూసిన వాళ్ల‌కు ఈ ట్రైల‌ర్ కొత్త‌గా అనిపించ‌క‌పోవొచ్చు. కానీ.. ఆ క‌థ తెలియ‌ని వాళ్ల‌కు ఆసక్తిక‌రంగానే ఉంటుంది. అయితే.. ద‌ర్శ‌కుడు మ‌క్కీకి మ‌క్కీ దింపేయ‌డానికి ట్రై చేసిన‌ట్టు అనిపించింది. ఎందుకంటే క‌నీసం హీరో పేరు కూడా మార్చ‌లేదు. బాలీవుడ్‌లో హీరో పేరు విక్కీ.. ఇక్క‌డా అంతే. అయితే ట్రైల‌ర్‌లో హీరో వేసే చిలిపి వేషాలు, స‌ర‌దా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, చిలిపి డైలాగుల‌తో ఆహ్లాదక‌రంగానే మ‌లిచాడు. స్పెర్మ్ డోనార్ అనేది తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించని విష‌యం. అయితే దాన్ని కూడా హుందా చూపించే ప్ర‌య‌త్నం సాగిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమా కేవ‌లం కామెడీని మాత్ర‌మే న‌మ్ముకొదని ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. ఆ కామెడీ కాస్త గ‌ట్టిగా వ‌ర్క‌వుట్ అయితే... సుమంత్ నిరీక్ష‌ణ ఫ‌లించిన‌ట్టే. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com