Home

»

Latest News

నయీం గ్యాంగ్‌‌ నుంచి వర్మకు బెదిరింపులు..?

Sep 27, 2016 1:06PM

అభిమానించే వాళ్లకు మేధావిగా..వాదించే వాళ్లకు ఇంకోలాగా కనిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా రామ్‌గోపాల్ వర్మే. దేశంలో ఎలాంటి సంచలనం కలిగినా వెంటనే అక్కడికి వాలిపోయి..దానిపై సినిమా తీస్తానని చెప్పడం వర్మ్ స్టైల్. తన కెరిర్‌లో ఎన్నో నిజ జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరించాడు వర్మ. అవన్నీ కాంట్రవర్సీ ఇష్యూస్ కావడంతో ఆయా కథలకు సంబంధించిన వ్యక్తుల నుంచి బెదిరింపులు సైతం ఎదుర్కొన్నాడు.

గల్లీ దాదాల నుంచి ఏకంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వరకు వార్నింగ్‌లు పొందాడు. రీసెంట్‌గా గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తెలుగు రాష్ట్రాలను ఒక కుదుపు కుదిపింది. ఇంకేముంది రామూ హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వడం వెంటనే నయీం జీవితం మీద సినిమా తీయబోతున్నట్టు..దానిని జనవరిలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో..తనకు నయీం అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ..ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయినా వర్మ ఇలాంటి వాటికి భయపడే రకం కాదు. రివర్స్‌లో...వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..నేను నయీంలకే నయీంని అని నాతో పెట్టుకోకండి అని వార్నింగ్ ఇచ్చాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com