Home

»

Latest News

ఇంటివాడైన సుడిగాలి సుధీర్

Oct 23, 2016 4:46PM

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే ఆ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హాట్ యాంకర్ రేష్మీతో సుధీర్ ప్రేమాయణం సాగిస్తున్నాడని ఎప్పటి నుంచో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే తాజాగా సుధీర్ ఓ ఇంటి వాడయ్యాడు. ఇంటి వాడవ్వడం అంటే పెళ్లి చేసుకున్నాడని కాదు. సొంత ఇల్లు కొనుక్కుని ఇంటి వాడవ్వడం. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలిపాడు. ఇల్లు కొనుక్కోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ, తెలుగు చిత్ర పరిశ్రమకు కృతజ్ఞతలు చెబుతున్నానని, వారి సపోర్ట్ లేకపోతే తాను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com