Home

»

Latest News

బాల‌య్య సినిమా.. భ‌లే మంచి చౌక బేర‌మూ...

Oct 24, 2016 10:58AM

టాలీవుడ్ మార్కెట్లు బాగా పెరిగాయి. బాహుబ‌లి ఎఫెక్ట్ చిత్ర‌సీమ‌పై బాగా ప‌డింది. ఆ సినిమా క‌నీవినీ ఎరుగ‌న‌వి వ‌సూళ్లు సాధించ‌డంతో మార్కెట్లు మ‌రింత ఓపెన్ అయ్యాయి. రూపాయి పెట్టుబ‌డి పెట్టాల్సిన చోట‌.. రెండు రూపాయ‌లు పెట్ట‌డానికి బ‌య్య‌ర్లు రెడీ అంటున్నారు. దాంతో అన్ని ఏరియాల‌లోనూ రేట్లు పెరిగిపోయాయి. స్టార్ హీరోలు కూడా బాహుబ‌లిని చూపించి సొమ్ములు చేసుకొంటున్నారు. బ‌డా హీరోల సినిమాల‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా... బాహుబ‌లి తెచ్చుకొన్న వ‌సూళ్ల దృష్ట్యా.. ఈ సినిమా కూడా బాహుబ‌లి అంత రేంజులో కాక‌పోయినా... అందులో స‌గ‌మైనా తెచ్చుకొంటుంది క‌దా, అనే ధీమాతో బ‌య్య‌ర్లు ముందుకువ‌స్తున్నారు. కాబ‌ట్టే... సినిమా సినిమాకీ రేట్లు పెరుగుతున్నాయి.

బాల‌య్య వందో సినిమా గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ఱికీ బీభ‌త్స‌మైన క్రేజ్ వ‌చ్చేసింది. అయితే బాల‌య్య మాత్రం.. అతి త‌క్కువ రేట్ల‌కు ఈ సినిమా అమ్మ‌డం ట్రేడ్ వ‌ర్గాల్ని సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.  నైజాం హ‌క్కుల్ని 11.25 కోట్లకు అమ్మేశారు.  గుంటూరు  4.50 కోట్లకు,  సీడెడ్ హక్కులను 9 కోట్ల రూపాయలకు ఇచ్చేశారు.  ఓవ‌ర్సీస్‌కి రూ.6 కోట్లు ద‌క్కాయి. బాల‌య్య సినిమా కాస్త వేచి చూసి, ఎక్కువ మొత్తం డిమాండ్ చేసి ఇంకా భారీగానే డ‌బ్బులు రాబ‌ట్టొచ్చు.కానీ.. వ‌చ్చిన రేటుకి ఈ సినిమాని అమ్మ‌డం.. విశేష‌మే. ఇంత త‌క్కువకు అమ్ముకొన్నా.. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.50 కోట్ల వ‌ర‌కూ అయ్యింది. ఇది బాల‌య్య సినిమాల్లోనే రికార్డు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com