Home

»

Latest News

త‌మ‌న్.. డిసెంబ‌ర్ సెంటిమెంట్!

Nov 30, 2021 4:11PM

క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్న యువ సంగీత ద‌ర్శ‌కుల్లో త‌మ‌న్ ఒక‌రు. కాగా, త‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో ఒక‌టైన `అఖండ‌`.. డిసెంబ‌ర్ 2న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. గ‌త రెండేళ్ళుగా డిసెంబ‌ర్ నెల‌లో విడుద‌లైన త‌మ‌న్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాన్నే అందుకున్నాయి. 2019లో డిసెంబ‌ర్ మాసంలో జ‌నం ముందు నిలిచిన `వెంకిమామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే` బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ గా నిల‌వ‌గా.. 2020 డిసెంబ‌ర్ నెల‌లో వ‌చ్చిన `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` క‌రోనా ఫ‌స్ట్ వేవ్ త‌రువాత థియేట‌ర్స్ లో రిలీజైన‌ తొలి నోట‌బుల్ తెలుగు చిత్రంగా నిలిచి మంచి ఆరంభ వసూళ్ళ‌తో వార్త‌ల్లో నిలిచింది. ఓవ‌రాల్ గా ఓకే అనిపించుకుంది. ఈ నేప‌థ్యంలో.. భారీ అంచ‌నాల న‌డుమ 2021 డిసెంబ‌ర్ 2న‌ విడుద‌ల‌వుతున్న `అఖండ‌`.. త‌మ‌న్ డిసెంబ‌ర్ సెంటిమెంట్ ని కొన‌సాగిస్తూ విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తుందేమో చూడాలి.

 న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన `అఖండ‌`కి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌గ్యా జైశ్వాల్, పూర్ణ‌, శ్రీ‌కాంత్, జ‌గ‌ప‌తి బాబు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాని ద్వార‌కా క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com