రాజమౌళి మహాభారతాన్ని చేయడు-విజయేంద్రప్రసాద్
on Jan 23, 2017
బాహుబలి-2 తర్వాత జక్కన్న తదుపరి సినిమా ఏమిటి..? ఎవరితో చేస్తున్నాడు..? ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు అభిమానులను ఆలోచింప చేస్తున్న ప్రశ్న ఇది. తర్వాతి సినిమా గురించి జక్కన్న నుంచి కానీ..ఆయన కుటుంబసభ్యుల నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు పుకార్లు పుట్టిస్తున్నారు..ఈ నేపథ్యంలో రాజమౌళి తన డ్రీ ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పని ఇప్పటికే మొదలుపెట్టాడని ప్రచారం జరుగుతోంది. కొందరు అయితే పాత్రల ఎంపిక కూడా జరిగిపోయిందని చెబుతున్నారు.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్. నేను కానీ, రాజమౌళీ కానీ మహాభారతం స్క్రిప్ట్ రాయడం ఎవరైనా చూశారా..? మరి అలాంటప్పుడు ఆ ప్రాజెక్ట్ చేస్తున్నామని ఎలా చెబుతారు అంటూ మండిపడ్డారు..అసలు ఇప్పటికిప్పుడు మహాభారతాన్ని తీసే ఆలోచన మాకు లేదని కుండబద్ధలు కొట్టారు విజయేంద్రప్రసాద్. మరి రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.