Home

»

Latest News

'దూకుడు' కి 15 ఏళ్లు: కృష్ణ గారు చెప్పిన మాటలు నిజమయ్యాయి..శ్రీను వైట్ల ఎమోషనల్!

Sep 23, 2026 12:16PM

బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కి 'సునామీ' అనే టాగ్ లైన్ కూడా వచ్చేలా చేసిన మూవీ 'దూకుడు'. మహేష్ బాబు కెరీర్ లో సైతం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు అప్పటివరకు ఉన్న రికార్డ్స్ సిగ్గుతో తల వచుకునేలా చేసింది.శ్రీను వైట్లని అయితే దర్శకుడిగా అగ్ర శిఖరాన నిలబెట్టింది. అలాంటి దూకుడు  2011 సెప్టెంబర్ 23న విడుదలైంది. అంటే నేటికీ పదిహేనేళ్ళు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల ఎక్స్  వేదికగా ట్వీట్ చేసాడు. 'వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ అద్భుతమైన సన్నివేశాలను నిన్ననే సెట్స్‌పై తీర్చిదిద్దామా అన్నంత తాజాగా ఉంది. తెరవెనుక మేము పంచుకున్న నవ్వుల నుంచి, థియేటర్లలో ప్రేక్షకులు చేసిన వేడుకల వరకు ప్రతి జ్ఞాపకం నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంది. సెట్స్‌లో యూనిట్ మొత్తం కలిసి పనిచేసిన క్షణాలు నాకు  ఎప్పటికీ ప్రత్యేకమైనవి.

"సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ‘దూకుడు’ కోసం కలిసి పనిచేయడం నా కెరీర్‌లోనే అత్యంత అపురూపమైన, మధురమైన అధ్యాయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఆయన అద్భుతమైన నటన, చూపించిన ఎనర్జీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ  గారు ‘దూకుడు’ గురించి చెప్పిన అమూల్యమైన మాటలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు నూటికి నూరు శాతం అక్షర సత్యాలయ్యాయి. ఆ మాటలు ఈనాటికీ నా చెవుల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి" అని గుర్తుచేసుకున్నారు.

ఇది కూడా చదవండి: పుష్ప లోని ఆ క్యారక్టర్ పై శివాజీ సంచలన వ్యాఖ్యలు: ఎంత పని చేసావు భయ్యా

ఈ చిత్ర నిర్మాణానికి వెన్నుదన్నుగా నిలిచిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలతో పాటు ‘దూకుడు’ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ శ్రీను వైట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మహేష్ ఫ్యాన్స్ అయితే ‘దూకుడు’ నాటి రికార్డులని గుర్తుచేసుకుంటూ నెట్టింట పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

 

 

Srinu Vaitla Emotional Comments On Mahesh Babu Dookudu, dookudu 15 years, Superstar Krishna prophetic words, mahesh Babu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News,

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com