సినీ పరిశ్రమలో విజయాలు, అపజయాలు సహజం. ఒక భాషలో కలిసిరాని లక్.. మరో భాషలో ఊహించని విధంగా తిరగబడటం మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు క్రేజీ బ్యూటీస్ శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే విషయంలో ఇదే జరుగుతోంది. తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన ఈ భామలకు, పక్కనే ఉన్న కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఘన స్వాగతం పలుకుతోంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లతో తమిళ తంబీలు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.
సంచలన డాన్సులతో, గ్లామర్‌తో టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ రేంజ్‌లో దూసుకుపోయిన శ్రీలీలకు ఇటీవలి కాలంలో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. పెద్ద హీరోలతో పాటు యంగ్ స్టార్స్ పక్కన నటించినా లక్ కలిసి రాలేదు. దీంతో తెలుగులో ఈమెకు కొత్త అవకాశాలు తగ్గాయి. అయితే తమిళంలో ‘పరాశక్తి’ అనే చిత్రంతో వైవిధ్యమైన డీ-గ్లామర్ రోల్ చేసి అక్కడి మేకర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే శ్రీలీలకు కోలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 55వ ప్రతిష్టాత్మక చిత్రంలో శ్రీలీలకు హీరోయిన్‌గా అవకాశం దక్కినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కేవలం ధనుష్ సినిమానే కాకుండా, తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో కూడా ఈ కిస్సిక్ బ్యూటీని కథానాయికగా లాక్ చేసినట్లు బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ రెండు భారీ చిత్రాలు కనక సక్సెస్ అయితే కోలీవుడ్‌లో శ్రీలీల టాప్ లీగ్‌లోకి వెళ్లడం ఖాయం.
మరోవైపు టాలీవుడ్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సైతం తమిళ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత ఈమె నటిస్తున్న ‘లెనిన్’ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ఈ తరుణంలో కోలీవుడ్ వర్సిటైల్ స్టార్ శివకార్తికేయన్ సరసన నటించే భారీ లక్కీ ఛాన్స్ ఆమె తలుపు తట్టింది.
శివకార్తికేయన్ హీరోగా రూపుదిద్దుకోనున్న ‘సియోన్’ అనే చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా ఎంపికైంది. ‘తాయి కిళవి’ చిత్రంతో తన ప్రతిభను చాటుకున్న శివకుమార్ మురుగేషన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విశ్వనటుడు కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటం విశేషం. ఇంతటి భారీ ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీకి అవకాశం రావడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఇద్దరు భామల కోలీవుడ్ ఎంట్రీపై సోషల్ మీడియాలో నెటిజన్లు, ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. టాలీవుడ్‌లో లక్ కలిసిరాకపోయినా, వారిలోని టాలెంట్‌ను గుర్తించి కోలీవుడ్ మేకర్స్ పెద్ద ప్రాజెక్ట్స్ ఇస్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో కచ్చితంగా ఈ ఇద్దరూ తమ సత్తా చాటుతారని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే ఇద్దరూ తమ కొత్త తమిళ చిత్రాల షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. తెలుగులో దక్కని కమర్షియల్ సక్సెస్, స్టార్ స్టేటస్ తమిళ తంబీల ఇండస్ట్రీలో ఈ సుందరీమణులకు దక్కుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!






