Home

»

Latest News

Sreeleela: సినిమాలకు శ్రీలీల గుడ్ బై.. తిలక్ వర్మతో లవ్ నిజమేనా?

May 18, 2026

టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న నటి శ్రీలీల (Sreeleela). ఒకానొక దశలో రోజుకు రెండు కాల్షీట్లు ఇస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఊపిరి సలపనంత బిజీగా గడిపింది ఈ యంగ్ బ్యూటీ. అయితే, గత కొంతకాలంగా శ్రీలీల వెండితెరపై పెద్దగా సందడి చేయడం లేదు. కొత్త సినిమాలకు కూడా సైన్ చేయడం లేదు. దీంతో ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయా? లేక కావాలనే సినిమాలను పక్కన పెట్టిందా? అనే చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలీల సినిమాలకు బ్రేక్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఆమె తల్లి స్వర్ణలత తాజాగా వెల్లడించారు.

శ్రీలీల సినిమాలకు దూరం కావడానికి కారణం ఆఫర్లు లేకపోవడం కాదు, చదువు కోసమే ఆమె కావాలని బ్రేక్ తీసుకుందని స్వర్ణలత స్పష్టం చేశారు. శ్రీలీల ఇప్పటికే ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె 'నీట్-పీజీ' (NEET-PG) ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఉన్నత చదువులపై దృష్టి పెట్టడం కోసమే కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదని, ఈ పరీక్షలు పూర్తయిన తర్వాతే మళ్లీ కొత్త సినిమాలకు కమిట్ అవుతుందని ఆమె తల్లి క్లారిటీ ఇచ్చారు.

సినిమాల ముచ్చట్లతో పాటు శ్రీలీల లవ్ లైఫ్, డేటింగ్ రూమర్లపై కూడా ఆమె తల్లి స్పందించారు. ఇటీవల కాలంలో యంగ్ క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు. అందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు.

గతంలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కూడా శ్రీలీల పేరును ముడిపెడుతూ రూమర్లు వచ్చాయని ఆమె గుర్తుచేశారు. కార్తీక్ ఆర్యన్ తల్లి, తాను ఇద్దరం గైనకాలజిస్టులమని.. వృత్తిపరంగా ఉన్న ఆ సాన్నిహిత్యం వల్లే శ్రీలీల-కార్తీక్ రిలేషన్‌లో ఉన్నారనే పుకార్లు పుట్టించారని తెలిపారు.

ప్రస్తుతానికైతే శ్రీలీల మనసంతా చదువు, కెరీర్ పైనే ఉందని స్వర్ణలత చెప్పుకొచ్చారు. రాబోయే ఐదారు సంవత్సరాల వరకు శ్రీలీల ఎలాంటి రిలేషన్ షిప్‌లోకి వెళ్లే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో శ్రీలీల లవ్ రూమర్లకు చెక్ పడినట్లయింది. పరీక్షలు ముగిసిన తర్వాత ఈ డాక్టర్ కమ్ యాక్ట్రెస్ మళ్లీ వెండితెరపై తన డాన్సులు, నటనతో అలరించడానికి సిద్ధం కానుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com