వరుణ్ తేజ్ కి జంటగా శ్రీ లీల!
on Oct 22, 2021
`పెళ్ళి సందD` చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన అందం.. శ్రీ లీల. మొదటి సినిమాతోనే మెస్మరైజ్ చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. త్వరలో మాస్ మహారాజా రవితేజకి జోడీగా దర్శనమివ్వనుందని టాక్. త్రినాథ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న `ధమాకా` కోసమే రవితేజకి జంటగా శ్రీ లీల నటించబోతోందని సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నాయికగా నటించే ఛాన్స్ దక్కించుకుందట ఈ ముద్దుగుమ్మ. ఆ వివరాల్లోకి వెళితే.. `ఛలో`, `భీష్మ` చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల.. త్వరలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఓ సినిమా రూపొందించనున్నాడని బజ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ జంటగా ఇద్దరు నాయికలు కనిపిస్తారని.. అందులో ఒకరిగా శ్రీ లీలని ఎంపిక చేశారని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం `గని`, `ఎఫ్ 3` చిత్రాలతో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన `గని` డిసెంబర్ 3న విడుదల కానుండగా.. హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న `ఎఫ్ 3` వచ్చే ఏడాది ప్రథమార్ధంలో థియేటర్స్ లో సందడి చేయనుంది.