Home

»

Latest News

Sreeleela: శ్రీలీల బిగ్ రిస్క్.. ఏకంగా విమర్శలు ఎదుర్కుంటున్న హీరోతో!

Jul 6, 2026 5:28PM

 

శ్రీలీల.. తనదైన పెర్ఫార్మ్, డ్యాన్సులతో షార్ట్ టైంలోనే  సెన్సేషనల్ బ్యూటీ గా మారింది..సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషలపై కూడా గట్టిగానే కన్నేసింది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ మూవీలోని స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీలకు బాలీవుడ్ నుండి భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే బాలీవుడ్ సెల్యులాయిడ్ పై  పరిచయం కాబోతున్న క్రేజీ డెబ్యూ ప్లాన్స్‌లో ఇప్పుడు ఊహించని మలుపు చోటుచేసుకుంది.

నిజానికి శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ అనగానే అందరి మైండ్‌లోనూ బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ పేరే గుర్తొచ్చింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్‌కి  జంటగా ‘ఆషికీ 3’ (అన్‌టైటిల్డ్ రొమాంటిక్ డ్రామా) చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. ఫిబ్రవరి 2025లోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా అధికారికంగా విడుదలైంది. అయితే, పలు కారణాల వల్ల ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చాలా కాలంగా ఆలస్యమవుతూ వస్తోంది. సినిమా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడం మరియు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉండటంతో, శ్రీలీల బాలీవుడ్ వ్యూహాన్ని పూర్తిగా మార్చాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే శ్రీలీల బాలీవుడ్‌లో ఒక బిగ్ రిస్క్ తీసుకోబోతోందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హిట్ ట్రాక్‌లో ఉన్న స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సినిమా ఆలస్యం కావడంతో, ఆమె బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కొడుకు, ఇబ్రహీం అలీ ఖాన్ సరసన ఒక సరికొత్త రొమాంటిక్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్. 'దిలేర్’ (Diler) అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా అగ్ర  నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కునాల్ దేశ్‌ముఖ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.


also read: ntr: లెనిన్ లో మాస్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గర్జన.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారంటీ

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇబ్రహీం అలీ ఖాన్ ఇప్పటివరకు నటించిన ‘నదానియాన్’, ‘సర్జమీన్’ అనే రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాల్లోని ఇబ్రహీం అలీ  నటనపై ప్రేక్షకుల నుండి, సినీ విమర్శకుల నుండి తీవ్రమైన మిశ్రమ స్పందన రావడమే కాకుండా సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ కూడా ఎదురైంది. ఇలా విమర్శలు ఎదుర్కొంటున్న ఒక అప్ కమింగ్ హీరోతో శ్రీలీల తన మొదటి బాలీవుడ్ థియేట్రికల్ మూవీని ఓకే చేయడం ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. ఒకవేళ కార్తీక్ ఆర్యన్ చిత్రం ముందుగా విడుదలయ్యుంటే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి ఒక బలమైన పునాది పడేదని, కానీ ఇప్పుడు వరుస ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న ఇబ్రహీంతో ‘దిలేర్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం శ్రీలీల కెరీర్‌కి  ఎలాంటి మలుపు ఇస్తుందోనని ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు.

   sreeleela, Ibrahim Ali,  Kartik Aaryan

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com