Home

»

Latest News

NTR: ఎన్టీఆర్ హీరోగా కొత్త సినిమా రాబోతుందా? నిజమెంత?

Oct 7, 2026 11:16AM


తెలుగు సినిమా తన ప్రభంజాన్ని కొనసాగిస్తూనే ఉన్నా ఎక్కడో తనలో చిన్న దిగులు.. ఆ దిగులు ఏంటంటే  విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తన ఒడిలో లేడని. అంతలా తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆ మహానటుడు లేకపోతే దిగులు పడదా చెప్పండి? తెలుగు సినిమాకే కాదు మాకు దిగులుగా ఉందని అంటున్నారా! ఆ దిగులుని పటాపంచలు చేసి మళ్ళీ మీరు సెల్యులాయిడ్ ముందుకెళ్లి చిందేసే సినీ శుభ గడియలు రాబోతున్నాయనే న్యూస్ సినీ సర్కిల్స్, అభిమానుల్లో ఎన్టీఆర్ బాడీలాంగ్వే జ్ తో మరి చిందేస్తూ  తిరుగుతున్నాయి.   

అవును ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ కాబోతుంది. ఎలా అని అనుకుంటున్నారా!  'ఏఐ'తో. ఇటీవలి కాలంలో హాలీవుడ్‌తో పాటు మన భారతీయ చిత్రసీమలో కూడా డీప్‌ఫేక్, 3D డిజిటల్ అవతార్ మరియు ఏఐ విజువల్ రీక్రియేషన్ సాంకేతికత 95% పైగా కచ్చితత్వంతో అభివృద్ధి చెందింది. 'కల్కి 2898 AD' వంటి భారీ ప్రాజెక్టులలోనూ, ఇతర విజువల్ ఎఫెక్ట్స్ సినిమాల్లో దివంగత లెజండ్రిస్ ని  ఏఐ రూపంలో చూపించే ప్రయత్నాలు జరిగాయి. 100% డిజిటల్ ఫేస్ రీకన్‌స్ట్రక్షన్ విధానం ద్వారా సెకనుకు 24 ఫ్రేమ్‌ల చొప్పున పాత సినిమాల ఫుటేజ్‌ను విశ్లేషించి, విశ్వరూపం చూపించిన ఎన్టీఆర్ గారి ముఖకవళికలు, గంభీరమైన గొంతును తిరిగి పునఃసృష్టించడం ఇప్పుడు సాంకేతికంగా సాధ్యమవుతోంది. వేలాది గంటల ఆర్కైవ్ వీడియోలను ఏఐ అల్గారిథమ్స్ ద్వారా ప్రాసెస్ చేసి, కొత్త కథలో ఆయనను నటింపజేసే దిశగా కొంతమంది యువ దర్శకులు, టెక్నాలజీ నిపుణులు ప్రయోగాత్మక టెస్ట్ ఫుటేజ్ తయారు చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ వార్త ఎంతవరకు నిజం, అలాగే ఇందులో ఉన్న సవాళ్లు ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఏఐ సాంకేతికతతో సీనియర్ ఎన్టీఆర్ గారి రూపంలో పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, కొన్ని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలు 80% కంటే ఎక్కువ కచ్చితత్వంతో విశ్వామిత్ర లేదా కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ గారి రూపాన్ని రీక్ర్రియేట్ చేయడానికి సాంకేతిక పరీక్షలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఏఐ ద్వారా నటులను పునఃసృష్టించడంలో సాంకేతిక సాధ్యతలతో పాటు చట్టపరమైన అనుమతులు, కాపీరైట్ చట్టాలు మరియు నందమూరి కుటుంబసభ్యుల సమ్మతి అత్యంత కీలకమైన అంశాలు. లీగల్ అనుమతులు లభిస్తే రాబోయే రోజుల్లో 5 నుంచి 10 నిమిషాల ప్రత్యేక సన్నివేశాల్లో లేదా క్లైమాక్స్ ఎపిసోడ్లలో సీనియర్ ఎన్టీఆర్ గారి డిజిటల్ రూపం మెరవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: రజినీకాంత్, ధనుష్ ల కొత్త పార్టీ: అధ్యక్షుడు, సెక్రటరీ ఎవరంటే!

 

 

తెలుగు తెరపై ఎన్టీఆర్ గారి నటన, ఆయన వాచకాభినయం, ఆంగిక విన్యాసాలు 100% యూనిక్ అయినవి. ఏఐ సాంకేతికత ఆయన రూపాన్ని, గొంతును ఎంత అద్భుతంగా పునఃసృష్టించినా, ఆయనలోని జీవాన్ని, స్వచ్ఛమైన భావోద్వేగాలను పూర్తిస్థాయిలో అందించడం ఇప్పటికీ పెద్ద సవాలే. ఏది ఏమైనా, టెక్నాలజీ పెరుగుతున్న వేగాన్ని చూస్తుంటే భవిష్యత్తులో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిని మళ్లీ వెండితెరపై రాజసంతో చూడాలనే అభిమానుల కల నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆ మహానటుడి సమ్మోహన రూపం ఏఐ ద్వారా మళ్లీ జీవం పోసుకుంటుందో లేదో చూడాలంటే రాబోయే కాలం వరకు వేచి చూడాల్సిందే. అసలు ఏఐ పుట్టిందే ఎన్టీఆర్ ని మళ్ళీ పుట్టించడానికేమో చూద్దాం. 

 

[Sr Ntr Ai Movie News Truth Explained, Sr NTR AI Movie, Senior NTR Digital Avatar, AI technology in Tollywood, Sr NTR Recreation with AI, Senior NTR AI Hero, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com