70 సంవత్సరాల ఎస్పీ 'బాలు'డు..!
on Jun 4, 2016
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఎన్నో ఏళ్లుగా ఈ పేరు మన జీవితాల్లో భాగమైపోయింది. రోజూవారీ అవసరం అయిపోయింది. బాలు గొంతు వినని తెలుగు వాడు ఉంటాడా..? ఎస్పీబీ గాత్రమాధుర్యాన్ని అనుభవించని తెలుగు లోగిలి ఉంటుందా..? బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, నిద్రపోతున్నా, ప్రయాణం చేస్తున్నా మన జీవితంలో ఏం చేస్తున్నా, మన ప్రతీ అడుగూ బాలుతో ముడిపడి ఉంటుంది. కాదనే ధైర్యం మనకుందా..?
గతజన్మలో గంథర్వుడిగా ఉండేవాడేమో..మన అదృష్టం కొద్దీ కిందకు మన మధ్య 'బాలు'డి లా వచ్చాడేమో.. ఆహా ఏమి మాధుర్యం. ఏమి గాత్రం. అమ్మపెట్టే గోరుముద్దలు, బడిలో మాస్టారు చెప్పే అఆ లతో పాటు బాలు పాట కూడా బాల్యంలో తప్పనిసరి. ఆయనకు పాటలు పాడీ పాడీ విసుగొచ్చి ఉండచ్చేమో కానీ, మనకు మాత్రం ఆయన గొంతు ఎన్ని వందల వేల లక్షల సార్లు విన్నా తనివి తీరదు. అవును మరి..అమ్మ చేతి వంట ఎన్ని సార్లు తిన్నా బోర్ కొట్టదు కదా..
పెద్ద ఎన్టీఆర్ కు పాడుతున్నాడా..గొంతులో ఆయన తరహా గాంభీర్యం వస్తుంది. ఎఎన్నార్ కు పాడుతున్నాడా..గొంతులో కొద్దిగా మైకం కైపు ధ్వనిస్తుంది.. చిరుకు పాడుతున్నాడా..చిన్న చిన్న చమక్కులు పాటలోకి చేరిపోతాయి. ఏ హీరోకు పాడినా, ఆ హీరోనే పాడుతున్నాడేమో అనిపించేట్టు చేయడం బాలు ప్రత్యేకత. మన బాలుకు మాత్రమే సొంతమైన ప్రత్యేకత ఇది. గొప్ప సింగర్లు చాలా మందే ఉండచ్చు. కానీ బాలుగారి లాంటి వాళ్లు మాత్రం తరానికి ఒక్కళ్లే పుడతారు.
బాలుగారి గొంతు నుంచి జాలువారిన పాటలు ఎన్ని ఉన్నాయో లేక్క లేదు. కానీ ఆయన తన గొంతును పెర్ఫెక్ట్ గా హీరోకు సింక్ చేసి పాడిన కొన్ని సాంగ్స్ తీయడం సాహసమే అయినా ఒక్కసారి ట్రై చేద్దాం.
1. ఎన్టీఆర్- జననీ జన్మభూమిశ్చ (బొబ్బిలి పులి)
2. ఎన్టీఆర్- పుణ్యభూమి నా దేశం ( మేజర్ చంద్రకాంత్)
3. ఎఎన్నార్- వందనం అభివందనం (ప్రేమాభిషేకం)
4. చిరంజీవి- చిలుకా క్షేమమా (రౌడీ అల్లుడు)
5. చిరంజీవి- ఛమక్కు ఛమక్కు ఛాం (కొండవీటి దొంగ)
6. మహేష్ - ఎప్పుడెప్పుడు (రాజకుమారుడు)