Home

»

Latest News

చైతన్యతో డేటింగ్ పై శోభిత షాకింగ్ రియాక్షన్!

Jun 28, 2022 5:18PM

'మేజర్' బ్యూటీ శోభిత దూళిపాళ్లతో అక్కినేని హీరో నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తాజాగా శోభిత క్లారిటీ ఇచ్చింది.

శోభితతో చైతన్య డేటింగ్ చేస్తున్నాడని ఇటీవల వార్తలొచ్చాయి. త్వరలో చైతన్య రెండో పెళ్లి చేసుకుంటాడని కూడా ప్రచారం జరిగింది. అయితే చైతన్యతో అసలు తనకు పెద్దగా పరిచయమే లేదంటూ చెప్పి షాక్ ఇచ్చింది శోభిత. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించింది. చైతన్యతో తాను ప్రేమలో ఉన్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఒకట్రెండు సార్లు హాయ్, బై చెప్పుకోవడం తప్ప.. అసలు తమ మధ్య అంత క్లోజ్ పరిచయం కూడా లేదని చెప్పింది.

కాగా చైతన్య, శోభిత కలిసి ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా వీరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు రావడం విశేషం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com