Home

»

Latest News

సునీత "రాగం" షార్ట్‌ఫిల్మ్ ఫస్ట్‌లుక్ పోస్టర్

Sep 28, 2016 11:49AM

గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా, యాంకర్‌గా తెలుగు వారికి సుపరిచితురాలైన సునీత నటిగా పరిచయమవుతున్నారు. అయితే అది సినిమాల్లో కాదు..షార్ట్‌ఫిల్మ్‌లో. మహిళా దర్శకురాలు "చైతన్య శ్రీ పెరంబదూర్" దర్శకత్వంలో "రాగం" పేరుతో తెరకెక్కుతున్న షార్ట్‌ఫిలింలో సునీత నటిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమ అభిమాన గాయని, తొలిసారి నటిగా ఎలా చేసిందా అన్న ఉత్కంఠతో అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాగం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ షార్ట్‌ఫిలింలో సునీతతో పాటు సమీర్, సాయికిరణ్, సన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రోలింగ్ రీల్స్, రేణుకా టాకీస్ సంస్థలు నిర్మిస్తుండగా. తెలుగువన్.కామ్ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com