Home

»

Latest News

బాహుబ‌లిని చూసి వాత‌లు పెట్టుకొంటున్న ప్ర‌భాస్‌

Sep 28, 2016 12:16PM

బాహుబ‌లితో ప్ర‌భాస్ రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ అనిపించుకొనే స్థాయి ద‌క్కించుకొన్నాడు. బాలీవుడ్‌లోనూ ప్ర‌భాస్ అంటే ఏంటో తెలిసొచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ.500 కోట్ల‌కు పైచిలుకు వ‌సూలు చేసింది. బాహుబ‌లి త‌ర‌వాత ప్ర‌భాస్ మార్కెట్ అనూహ్యంగా పెరిగింద‌న‌డంలో సందేహం లేదు. అయితే ప్ర‌తీ సినిమా బాహుబ‌లి కాదు. ప్ర‌తీ సినిమా ఆ రేంజులో వ‌సూళ్లు చేయ‌దు. ఈ విష‌యాన్ని ప్ర‌భాస్ ఎందుక‌నో విస్మ‌రిస్తున్నాడేమో అనిపిస్తోంది. బాహుబ‌లి 2 ముగిసిన త‌ర‌వాత ప్ర‌భాస్ సుజిత్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలుసా?? రూ.100 కోట్లు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా తీయాల‌ని స్కెచ్ వేస్తున్నారు.

ప్ర‌భాస్‌పై వంద కోట్ల సినిమా అంటే.. అది నిజంగా భారీ రిస్కే. ఎందుకంటే... ప్ర‌తీ సినిమాకీ బాహుబలి రేంజులో వ‌సూళ్లొస్తాయ‌ని ఎందుకు అనుకోవాలి?  బాహుబ‌లి వెనుక రాజ‌మౌళి ఉన్నాడు. రాజ‌మౌళి బ్రాండ్ వాల్యూ బాహుబ‌లికి ముందే ఓ రేంజులో ఉంది. అందుకే ఆ సినిమాకి మార్కెట్ ఆ స్థాయిలో జ‌రిగింది. కానీ సుజిత్ తీసింది ఒక్క సినిమానే. యూవీ క్రియేషన్స్ అంటే ప్ర‌భాస్ సొంత సంస్థ లాంటిది. ప్ర‌భాస్ ఎంత చెబితే అంత అక్క‌డ‌. ప్ర‌భాస్ త‌న‌పై పెరుగుతున్న బ‌డ్జెట్‌ని తానే కంట్రోల్ చేసుకొంటే మంచిది. లేదంటే... ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌వు. త‌న సినిమాలో అద్భుత‌మైన కంటెంట్ ఉందీ అనే న‌మ్మకం క‌లిగితే ఈ రేంజులో పెట్టుబ‌డి పెట్టుకోవ‌డం కూడా త‌ప్పుకాదు. మ‌రి ఆ స‌త్తా ప్ర‌భాస్ సినిమాలో ఉందా, లేదా?  అనేది తేలాల్సివుంది. కేవ‌లం బాహుబ‌లి వ‌ల్ల వ‌చ్చిన వెయిటేజీని వాడేద్దాం అనుకొంటే ప్ర‌భాస్ తో పాటు యూవీ క్రియేష‌న్స్ రిస్క్ లో ప‌డ‌డం ఖాయం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com