Home

»

Latest News

sunitha: నా బాడీ నా ఇష్టం అంటే.. సింగర్ సునీత సంచలన వ్యాఖ్యలు

Jun 25, 2026 3:45PM

 

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత. సమాజంలో జరిగే పలు సామాజిక విషయాలపై  ఎప్పుడూ ఎంతో స్పష్టంగా, ప్రాక్టికల్ కోణంలో ఆలోచింపజేసేలా మాట్లాడుతుంటారు. గత కొన్నేళ్లుగా సమాజంలో కొంత మంది ఆడవారు 'మై బాడీ.. మై రైట్' (నా శరీరం.. నా హక్కు) అనే స్లోగన్ ని ట్రెండ్ చేస్తున్నారు. తాము ఎలాంటి బట్టలు వేసుకున్నా మగవారు కామెంట్స్ చేయకూడదని, తమ శరీరానికి ఏది కంఫర్ట్ ఉంటుందో అదే వేసుకుంటామని తెలుపుతూ వస్తున్నారు.  తాజాగా ఆమె ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో పైన చెప్పుకున్న విషయంపై తన భావాన్ని వెల్లడి చేసింది. 

సునీత మాట్లాడుతు 'అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం అని తమకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛని కోరుకున్నప్పుడు, అవతలి వ్యక్తి చూసే చూపుని  కూడా 'వాడి కళ్ళు వాడి ఇష్టం' అనాల్సి వస్తుంది. బిలియన్ల మంది మనుషుల ఆలోచనలని,చూపులని  మార్చడం కంటే మన భద్రత, మన నిర్ణయాలపై దృష్టి పెట్టడం చాలా సులభమైన మార్గం .నీకు ఇష్టమైన బట్టలు వేసుకో, హాయిగా ఉండు, కానీ ఇదే కరెక్ట్ అని అందరికీ చెప్పొద్దని హితవు పలకద్దు. చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయనేది చూసుకొని దుస్తులు ధరించాలి. ఇతరుల చూపులు ఇబ్బంది పెట్టకుండా మనం ఎక్కడైతే పూర్తి సురక్షితంగా భావిస్తామో అక్కడ మాత్రమే నచ్చిన దుస్తులు ధరించడం ప్రాక్టికల్‌గా కరెక్ట్ .కేవలం చిన్న బట్టలు వేసుకోవడం లేదా సిగరెట్లు తాగడం ఈక్వాలిటీ కాదు. అది కేవలం స్టూపిడిటీ మాత్రమే. మగవాడు సిగరెట్ తాగితే వాడి జీవితంలో కొన్ని నిమిషాలు తగ్గుతాయేమో, కానీ అదే సిగరెట్ ఒక ఆడపిల్ల తాగితే ఆవిడ లైఫ్ లో నుంచి ఏకంగా 12 గంటల ఆయుష్షు వెళ్ళిపోతుంది. ఇలాంటి వాటిల్లో మగవాళ్లతో సమానత్వం వెతుక్కోవడం ఏంటి? . నాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవడమే ఫెమినిజం అంటే నవ్వొస్తుంది.


Also read: chiranjeevi: విశ్వంభర కోసం రంగంలోకి నాగ్ అశ్విన్!  ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు


నిజమైన ఫెమినిజం లేదా సమానత్వం అంటే ఒక ఇంట్లో కానీ, సమాజంలో కానీ ఒక మహిళ నిలబడి తన అభిప్రాయాన్ని చెప్తే, దానికి పురుషులు ఎంతవరకు విలువ ఇస్తున్నారు, ఆమె ఆలోచనా విధానాన్ని గౌరవిస్తున్నారా లేదా అనే దానిపై పోరాడాలి  బట్టల పరిధి పెంచుకోవడాన్ని ఫ్రీడమ్ అనరు. ఆడవాళ్లు, మగవాళ్లు సమానం కాదు. ఇద్దరి కంపోజిషన్, నేచర్ వేరు. ఇదే ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో 31 ఏళ్లుగా కొనసాగుతున్న అనుభవంతో చెప్తున్నాను. కొత్తగా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటాన్నారు. నా కెరీర్ ప్రారంభ దశలో నేను కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఇక్కడ మహిళలు సురక్షితంగా ఉండాలంటే మెంటల్‌గా, ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా ఎంతో బలంగా ఉండాలని చెప్పుకొచ్చింది.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com