
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి (Chandrasekhar Yeleti) రూటే వేరు. ఆయన సినిమా వస్తోందంటే చాలు సినిమా లవర్స్‌లో ఒక రకమైన క్యూరియాసిటీ కలుగుతుంది. ఐతే, అనుకోకుండా, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం వంటి విభిన్న చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ఈ వెరైటీ దర్శకుడు ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు రాబోతున్నారు.
ఈసారి ఆయనతో జతకడుతున్న హీరో మరెవరో కాదు, సౌత్ ఇండియాలో 'లవ్ టుడే' సినిమాతో సెన్సేషన్ సృష్టించి, యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). వీరిద్దరి అరుదైన కలయికలో ఒక భారీ సినిమా రూపుదిద్దుకోబోతుండటం ఇండస్ట్రీ వర్గాలలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని సమాచారం. మైత్రీ బ్యానర్ లో ఇప్పటికే 'డ్యూడ్' అనే సినిమా చేశాడు ప్రదీప్. అయితే ఆ సినిమా తమిళ్ లోనే రూపొందింది. కానీ ఇప్పుడు చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్ట్ తెలుగులోనే తెరకెక్కనుంది. దీంతో ప్రదీప్ రంగనాథన్ మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా (Straight Telugu Film) ఇదే కానుంది.
చంద్రశేఖర్ యేలేటి మార్క్ డిఫరెంట్ స్క్రిప్ట్‌కు, ప్రదీప్ రంగనాథన్ మార్క్ యూత్‌ఫుల్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ తోడైతే థియేటర్లలో వినోదాల పంట పండటం ఖాయమని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ప్రస్తుతం స్క్రిప్ట్ లాక్ చేసి, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.





