కవల పిల్లలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి
on Jun 22, 2022
యాక్టర్, డైరెక్టర్ ఐన రాహుల్ రవీంద్రన్ నాన్నయ్యాడు.. సింగర్ చిన్మయి ఇంట సందడి నెలకొంది. ఫేమస్ సింగర్ చిన్మయి శ్రీపాద రాత్రి కవలలకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అంతులేదు. ఈ ఆనందకర విషయాన్ని రాహుల్ సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. మా ఇద్దరి ప్రపంచంలోకి ఒక బాబు, ఒక పాప అతిథుల్లా వచ్చారు. వాళ్ళే ద్రిప్త, సర్వస్. ఈ చిన్నారులు మా ఇంట అడుగుపెట్టిన ఈ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేమని చిన్నారుల చేతుల్ని పట్టుకున్న ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసి నెటిజన్లు, సెలెబ్రిటీస్ చెప్తున్న విషెస్ తో సోషల్ మీడియా హోరెత్తుతోంది.
ఇద్దరూ అర్ధం చేసుకుని ప్రేమించుకుని పెద్దల అంగీరంతో 2014 లో వివాహం చేసుకున్నారు. సమంత నటించే చాలా సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్తూ ఉంటారు. తెలుగులో ఆమె ఎన్నో పాటలు కూడా పాడారు. బాయ్స్, శివాజీ, ఆరెంజ్, ఏ మాయ చేసావే, ఊసరవెల్లి, రంగం, ఎందుకంటే ప్రేమంట, గోవిందుడు అందరి వాడేలే, ఇటీవల రిలీజై సూపర్ సక్సెస్ ని అందుకున్న మేజర్ వరకు ఎన్నో మూవీస్ లో పాటలు పాడారు. రాహుల్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మూవీస్ లో నటించారు. అందాలరాక్షసి మూవీతో ఒక ట్రెండ్ సెట్ చేశారు రాహుల్.
ఇక శ్యామ్ సింగరాయ్ మూవీలో పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇంకా సుశాంత్ హీరోగా నటించిన చి..ల..సౌ..మూవీతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు రాహుల్ రవీంద్రన్. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఈ మూవీ మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక ఒక హిట్ తర్వాత ఒక డిజాస్టర్ ని కూడా అందుకున్నాడు రాహుల్. మన్మధుడు మూవీకి సీక్వెల్ గా నాగార్జునతో మన్మధుడు - 2 తీసాడు కానీ అది అంత బాగా ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. ఇక చిన్మయి గతంలో కాస్టింగ్ కౌచ్ పై, మీటు పై చాలా ధైర్యంగా పోరాడిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read