
2003 జులై 9న విడుదలైన 'సింహాద్రి' సినిమా తెలుగు చిత్రసీమ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ ఎలాంటిదో ఇప్పటి తరానికి ఊహించడం కూడా కష్టమే. కేవలం 20 ఏళ్ల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ తన నటవిశ్వరూపంతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
అసలు ఈ సినిమా రికార్డుల విషయానికి వస్తే.. ఆ కాలంలో ఉన్న పెద్ద పెద్ద మాస్ సినిమాల రికార్డులన్నింటినీ 'సింహాద్రి' ఒక్కదెబ్బతో తుడిచిపెట్టేసింది. 150కి పైగా కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా, ఏకంగా 52 డైరెక్ట్ సెంటర్లలో 175 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. షిఫ్టులతో కలిపి చూస్తే 55 సెంటర్లలో ఈ చిత్రం 175 రోజుల వేడుకలు జరుపుకోవడం అప్పట్లో ఒక ఊహించని సంచలనం.
ఇప్పుడు 175 రోజుల రికార్డు సంగతి అటుంచితే, అసలు 50 రోజులు ఆడటం కూడా వింతే. ఎంతటి గొప్ప సినిమా అయినా రెండు నుంచి నాలుగు వారాలకే పరిమితమవుతున్నాయి. ఈ లెక్కన 'సింహాద్రి' 175 రోజుల రికార్డు ఎప్పటికీ బ్రేక్ అవ్వకుండా, చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: 'ప్రాణం ఖరీదు' వెనుక ఉన్న సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.?
.webp)
మీకు నచ్చవచ్చు:
రాయిని ఆడది చేసిన రాముడివా.. 44 ఏళ్ళ క్రితం వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్.!
ఇండియాస్ రియల్ జేమ్స్ బాండ్.. RAW వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఇతనే.!
[Simhadri 175 Days Record, Simhadri 175 Days Centers, Simhadri Movie Records, Simhadri Industry Hit, Simhadri All Time Record, Rajamouli Simhadri Movie, Jr NTR Simhadri Movie, Telugu Film News, Telugu News]




