టాలీవుడ్‌లో తనదైన కామెడీ, ఎంటర్‌టైనింగ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ అభిమాని ఊహించని విధంగా తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. దీంతో అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేశారు.
తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో అనిల్ రావిపూడిని కలిసేందుకు ఓ అభిమాని వచ్చాడు. ఈ సందర్భంగా అతడు దర్శకుడి కాళ్లపై పడి నమస్కరించాడు. వెంటనే స్పందించిన అనిల్ రావిపూడి.. తన కాళ్లపై ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. అభిమాని అలా చేయడాన్ని సున్నితంగా వారించారు.
ఇది కూడా చదవండి: రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా రాను.. ఐశ్వర్యలక్ష్మి షాకింగ్ కామెంట్స్
అనంతరం తనకు అభిమానులంటే ఎంతో గౌరవం ఉందని అనిల్ రావిపూడి చెప్పినట్లు సమాచారం. తనను ఒక దర్శకుడిగా, మనిషిగా అభిమానించడం తనకు సంతోషమేనని.. అయితే ఇలా కాళ్లపై పడటం మాత్రం తనకు నచ్చదని స్పష్టం చేశారు. అభిమానులు తనను గౌరవిస్తే చాలని, ఇలాంటి విధానాల్లో అభిమానం చూపించాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ సందర్భంగా తాను సాయిబాబా గుడి నిర్మిస్తున్నానని కూడా అనిల్ రావిపూడి చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనిల్ రావిపూడి స్పందించిన తీరుపై నెటిజన్లు కూడా చర్చించుకుంటున్నారు. అభిమానులు తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తం చేస్తుంటారు. అయితే అభిమాని తన కాళ్లపై పడటాన్ని అనిల్ రావిపూడి సున్నితంగా అడ్డుకోవడం ఈ వీడియోలో ప్రత్యేకంగా కనిపిస్తోంది.
మీకు నచ్చవచ్చు: నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి, పవన్‌కళ్యాణ్ తీసుకున్న సంచలన నిర్ణయం
[Anil Ravipudi, Anil Ravipudi Fan, Anil Ravipudi Viral Video, Anil Ravipudi Latest News, Anil Ravipudi Fan Event, Anil Ravipudi Reaction, Mana Shankara Vara Prasad Garu, Chiranjeevi, Chiranjeevi Anil Ravipudi, Tollywood News, Telugu Cinema News]




