Home

»

Latest News

క్రేజీ కాంబో.. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో సిద్ధు జొన్నలగడ్డ మూవీ.!

Jul 8, 2026 9:52AM

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన విలక్షణమైన కథలతో విభిన్నమైన ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ కెరీర్‌ను ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక వెబ్‌సిరీస్ చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ భారీ వెబ్‌సిరీస్‌తో పాటు, ఆయన ఖాతాలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌తో పాటు సిద్ధు జొన్నలగడ్డ ‘ఆర్ఎస్ జే స్వరూప్’ దర్శకత్వంలో ఒక విలక్షణమైన సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. తాజాగా సిద్ధు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ అయిన 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్‌లో సిద్ధు ఒక సరికొత్త చిత్రం చేయనున్నట్లు సమాచారం. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే ఫిలిం నగర్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి.

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ చిత్రంతో సుకుమార్ సోదరుడి కుమారుడు బాబీ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు సమాచారం అందుతోంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌ నుంచి వచ్చే సినిమాలు ఎప్పుడూ వైవిధ్యమైన కథాంశాలతో, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ సక్సెస్ అవుతుంటాయి. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ఎనర్జీకి, సుకుమార్ స్కూల్ నుంచి వస్తున్న సరికొత్త కాన్సెప్ట్‌ తోడైతే థియేటర్లలో నెక్ట్స్ లెవెల్ వినోదం ఖాయమని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టాక్. ఎనర్జిటిక్ హీరో సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక అదిరిపోయే స్క్రిప్ట్‌ను బాబీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ నిర్మాణంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రబృందం అధికారికంగా వెల్లడించే అవకాశముంది. 

 

 

Siddhu Jonnalagadda, Sukumar, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com