Home

»

Latest News

Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. తమిళ్, కన్నడ స్టార్స్ తో

Jun 1, 2026 3:02PM

 

 

గత ఏడాది వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లిటిల్ హార్ట్స్ తో కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న భామ 'శివాని నాగరం'(Shivani Nagaram). కాత్యాయిని క్యారక్టర్ లో   అద్భుతమైన పెర్ ఫార్మ్  హోమ్లీ లుక్స్‌తో  ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ఫాన్ బేస్ ని కూడా పొందింది . ప్రీవియస్ చిత్రం 'హే బల్వంత్'  తో మెస్మరైజ్ చేసిన శివానికి   ఇప్పుడు ఇతర పరిశ్రమల నుండి క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, శివాని  కెరీర్‌లో ఒక ఊహించని పెద్ద లక్కీ ఛాన్స్ దక్కింది.  డెబ్యూ సినిమాతోనే తమిళ్ లో అదరగొట్టిన యువ దర్శకుడు హీరో అభీషన్ జీవింత్ ,కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో శివాని కూడా  చేస్తున్నట్టు ఇపుడు ఖరారు అయ్యింది. నిజానికి అభీషన్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తాడని చాలామంది అనుకున్నారు కానీ ఈ చిత్రాన్ని గౌతమ్ శివరామన్ దర్శకత్వం వహించనున్నారు. ఇలా కన్నడ, తమిళ్ స్టార్స్ సినిమాలో శివానికి లక్కీ ఛాన్స్ నే దొరికింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకి రావాల్సి ఉంది..ఈ గోల్డెన్ ఛాన్స్‌తో శివాని నాగరం సౌత్ ఇండియాలోనే బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

also read: pawan kalyan: పవన్ కళ్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు.. ప్రముఖ అగ్ర నిర్మాత ట్వీట్ వైరల్

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. 100 శాతం ఎనర్జీతో, తన నేచురల్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన శివాని, ఇప్పుడు కోలీవుడ్, శాండల్‌వుడ్ బాక్సాఫీస్‌లపై కన్నేసింది. 'లిటిల్ హార్ట్స్' సినిమాతో దాదాపు 90 శాతానికి పైగా పాజిటివ్ రివ్యూస్ అందుకోవడమే కాకుండా, ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి శివాని కెరీర్‌కి గట్టి పునాది వేసింది. వరుసగా ఇంటర్వ్యూలు, సినిమా ఛాన్స్‌లతో దూసుకుపోతున్న ఈ యంగ్ బ్యూటీ, రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లక్కీ ఛాన్స్ ఆమె కెరీర్‌ని  ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.    

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com